Header Top logo

ప్రభుత్వ ఉద్యోగులకు ఫేస్ రికగ్నేషన్ హాజరు మస్ట్

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి

టైమ్ టు టైమ్ డ్యూటీ చేయాల్సిందే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తప్పని సరి ప్రభుత్వ ఉద్యోగులు టైమ్ టు టు డ్యూటీ చేయాల్సి ఉంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా జగన్ సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయం టైమ్ కు ఆఫీస్ కు వెళ్లలేని లేజీ ఎంప్లాయిస్ కు  ఇది బ్యాడ్ న్యూస్.

జనవరి 16వ తేది నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఫేస్ రికగ్నేషన్ హాజరు మస్ట్ చేస్తూ ప్రభుత్వం జీవో 159/26-12-2022 చీఫ్ సెక్రటరీ జవహార్ రెడ్డి జీవో జారి చేశారు. సచివాలయం, హెచ్ వోడీలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాల వరకు ఉద్యోగులందరికి ఈ నిబంధన వర్తిస్తుంది. అన్ని కేడర్ల ఉద్యోగులకు పేస్ రికగ్నిషన్ హాజరు తప్పని సరి చేశారు.

ఇప్పటికే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ  ఫేస్ రికగ్నేషన్ హాజరు అమలు చేస్తున్న సంగతి విధితమే. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకించారు. యాప్ సరిగా పని చేయడం లేదని కొన్ని లోటు పాట్లు ఉన్నట్లు గుర్తించారు.

అయితే.. గ్రామం నుంచి అసెంబ్లీ వరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి  ఫేస్ రికగ్నేషన్ హాజరు మస్ట్ అంటూ ఆ జీవోలో పేర్కొన్నారు. అలాగే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నేషన్ హాజరు విధానం అమలు  చేస్తారు.

కేసీఆర్ అమలు చేస్తారా..???

తెలంగాణ ప్రభుత్వం ఫేస్ రికగ్నేషన్ హాజరు గురించి ఆలోచిస్తుందా.. లేదా అనే సందేహం వ్యక్తం అవుతుంది. ప్రతిది రాజకీయ కోణంలో చూసే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయాన్ని ఎన్నికల వరకు వాయిదా వేయచ్చంటున్నారు. ఏది ఏమైన జగన్ సర్కార్ ఫేస్ రికగ్నేషన్ హాజరు మస్ట్ అంటూ తీసుకున్న నిర్ణయాలన్ని పలువురు అభినందిస్తున్నారు.

  • యాటకర్ల మల్లేష్

Leave A Reply

Your email address will not be published.

Breaking