Header Top logo

Young cartoonist Nakka Ilayaraja యువ కార్టునిస్టు నక్కా ఇళయరాజా

Young cartoonist Nakka Ilayaraja

యువ కార్టునిస్టు

నక్కా ఇళయరాజా ప్రస్థానం..

ilayaraja young cortoonist

సెలవంటూ వెళ్ళిపోయిన యువ కార్టూనిస్ట్ ఇళయరాజా

నన్ను సముద్రపు బొడ్డున ఒదిలేయండి

ముత్యం దొరకలేదని బాధపడను

ఇసుకలో పీచ్చుక గూళ్ళు కట్టి

ఒక మహాసామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాను..

నన్ను తూనీగా లాగో, సీతకోకచిలుకలాగో

గాలిలోకి వదిలేయండి

పూలు లేవని,

వన్నెల ఇంద్రచాపం లేదని చిన్న బుచ్చుకొను

గాలి భాషకు వ్యాకణం రాసి పారేసి

వర్షాల గురించి వాయుగుండాల గురించి

మీ చెవిలో రహస్యాలను ఊదేస్తాను

Young cartoonist Nakka Ilayaraja

      శిఖామణి, కవి

యువ కార్టునిస్టు నక్కా ఇళయరాజా

అవును నిజమే కదా!
ఎక్కడ ఉన్నా, ఏమైనా కొంతమంది సమున్నతసంకల్పబలంతో, అచంచల ధ్యేయంతో అకుంఠిత సాధనచేసి ప్రతిభావంతులుగా రాణిస్తారు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలుచుకొని అతి చిన్నవయస్సులోనే అద్భుతాలు సాధిస్తారు. తన చుట్టూ ముసురుకున్న నిరాశ, నిస్పృహలను తరిమికొట్టి, అపూర్వ స్ఫూర్తి కాంతిని దశదిశలా ప్రసరిస్తారు. విషాదాల నిశీధుల్లో ఉషోదయం కలిగిస్తారు. ఆవరోధాలను అధిగమించి జీవితాన్నిగెలిచే నైపుణ్యాన్ని సమకూరుస్తారు. ఇలాంటి అరుదైన యువ కార్టునిస్టు నక్కా ఇళయరాజా.

Young cartoonist Nakka Ilayaraja

వీల్ చైర్ కే పరిమితమైనా..

పుట్టుకతోనే కండరాల వ్యాధి సంక్రమించినా, పదేళ్లకే వీల్ చైర్ కే పరిమితమైనా లెక్క చేయకుండా, మొక్కవోని ఆత్మ విశ్వాషంతో. నిరంతర కృషితో తన కళాభిరుచికి పుటం పెట్టుకొని వర్ధమాన యువకార్టూనిస్టు ఎదిగి ఎంతో మంది మన్ననలను అందుకున్నాడు.

Young cartoonist Nakka Ilayaraja

యువ కార్టునిస్టూగా మన్ననలు..

ఇళయరాజా పదిహేనేళ్ల ప్రాయంలోనే వేసిన కార్టూన్ లను చూసి సుప్రసిద్ధ నవలా రచయిత డా కేశవరెడ్డి అబ్బురపోయాడు. ప్రముఖ చిత్రకారుడు బాపు, అపురూపమైన ఇళయరాజా కళాగరిమను పరిశీలించి కార్టూనిస్టుగా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశీస్సులందించాడు. ‘ఇళయరాజా’ బొమ్మలకథలన్నా, కార్టూన్ లన్నా తనకు చాలా ఇష్టమని ‘చెప్పటమే కాకుండా, ఇళయరాజాను ఇండోనేషియా కార్టూనిస్టు ‘ఆగస్ఎకోసాంటోస్’ తో పోల్చి అభినందించాడు ప్రఖ్యాత కార్టూనిస్టు జయదేవ్. డా. గురవారెడ్డి, చంద్ర, సినిమాదర్శకుడు పెద్ద వంశీ లాంటి ప్రముఖుల ప్రశంసలందుకున్నాడు నక్కా ఇళయరాజా. Young cartoonist Nakka Ilayaraja

Young cartoonist Nakka Ilayaraja

కార్టునిస్టూ బాపుతో ఇళాయరాజా ఫ్యామిలీ

ఇళయరాజా కుటుంబం..

1995 జూలై 30 డా. నక్కా విజయరామరాజు, డా. నందిని దంపతులకు ఇళయరాజా జన్మించాడు. ఈ దంపతులిద్దరూ వైద్యవృత్తి రీత్యా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో స్థిరపడ్డారు. డా. నక్కా విజయరామరాజు కేంద్ర కార్మికశాఖలో చీఫ్ మెడికల్ ఆఫీసర్. అంతే కాకుండా డా. రామారాజు సుప్రసిద్ద కథారచయిత, మధురమైన ఇళాయరాజ సంగీతం వల్ల ఉన్న మక్కువతో పెద్ద కుమారుడికి ఇళయరాజా అని పేరు పెట్టుకున్నారు.

Young cartoonist Nakka Ilayaraja

కొడుకు పేరుతో విరాళాలు..

కండరాల వ్యాధి మూలంగా ఆనారోగ్యం పాలై ఇంట్లో కదలలేనిస్థితిలో వున్న ఇళయరాజా కోసం తన కేరీర్ ను త్రోసిరాజని కన్నతల్లి డాక్టర్ నందిని ప్రతినిత్యం గుండెల మీద పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడింది. తల్లిదండ్రులిద్దరూ బాల్యం నుండి ఇళయరాజా అభిరుచిని గౌరవించారు. ఎంత కష్టమైనా సరే కొడుకు ఇష్టాన్ని మన్నించారు. ఇళయరాజా పుట్టిన రోజు వేడుకలను ఏ అనాథణాలయంలోనో, చెవిటి మూగ పాఠశాలలోనో నిర్వహించి, ఆయా సంస్థలకు దంపతులిద్దరూ తమ కొడుకు పేరుతో విరాళాలు అందించేవారు.

Young cartoonist Nakka Ilayaraja

పేదలను దత్తత తీసుకుని..

ఎంతో మంది నిరుపేద విద్యార్థులను దత్తత తీసుకుని కొడిగట్టి పోతున్న వారి జీవితాల్తో కొత్త వెలుగులు నింపారు. ఈ వెలుగులతోనే కొడుకు పట్ల తమ గుండెల్లో గూడు కట్టుకున్న దిగులు చీకట్లను తొలగించుకున్నారు. బాల్యం నుంచి దీనులను , పేదలను ప్రేమించే సంస్కారాన్ని ఇళయరాజాలో నూరి పోశారు. సామాజిక సృహాను, సృజనకళా స్పూర్తిని పెంపొందింపజేశారు.

Young cartoonist Nakka Ilayaraja

ఇళయరాజాను ప్రోత్సహించిన తల్లిదండ్రులు

పువ్వుపుట్టగానే పరిమలించినట్లుగా ఇళయరాజా బడికి వెళ్లిన మొదటి రోజునుండే అలవోకగా బొమ్మలు వేయటం ప్రారంభించాడు. బడిలో అక్షరమాల దిద్దకుండా బొమ్మలు వేస్తున్న ఇళయరాజాను స్కూల్ టీచర్ బెత్తం తో శిక్షిస్తే, ‘నా బిడ్డ బొమ్మలు వేస్తే మీకొచ్చే నష్టం ఏంటని’ ఇళయరాజా అమ్మగారు డాక్టర్ నందిని ఏకంగా టీచర్ తోనే పోట్లాడింది. అప్పటినుండి ఇళయరాజా తల్లిదండ్రులు అతని రంగులలోకంలో చిత్రాలయ్యారు, అతని బొమ్మల ప్రపంచంలో మమేకమై, బిడ్డ చేతిలో పెన్సిల్ గా పేపర్ గా మారిపోయారు. అనుక్షణం ఇళయరాజాను ప్రోత్సహించారు. Young cartoonist Nakka Ilayaraja

Young cartoonist Nakka Ilayaraja

వ్యంగంగా వ్యాఖ్యానిస్తూ కార్టూన్ లు..

డా రామరాజు కు చిత్ర కళ లో ప్రవేశం ఉండడంతో ఇళయరాజాకు తదనుగుణమైన మెళుకువలు నేర్పించాడు. ఒకవైపు చదువుకుంటూనే ఇళయరాజా బొమ్మలు గీస్తూ చిన్న చిన్న కార్టూన్లు వేస్తూ క్రమక్రమంగా ఈ రంగంలో పట్టుసాధించాడు. గత ఐదు సంవత్సరాలుగా ఇళయరాజా సమకాలీన సామాజిక రాజకీయ పరిస్థితులను వ్యంగంగా వ్యాఖ్యానిస్తూ వందలాది కార్టూన్ లను చిత్రించాడు. కార్టూన్ బొమ్మ గీయటంలో, దానికి అనుబంధంగా హాస్య చతురోక్తిని పొందుపరచటంలో ఇళయరాజా తనకంటూ ఒక విశిష్ట శైలిని ఏర్పరుచుకున్నాడు. ముందుతరం చిత్రకారులను అనుసరించకుండా స్వతంత్ర కళా వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాడు.

Young cartoonist Nakka Ilayaraja

సామాజిక మాధ్యమాల ద్వారా..

చిన్న వయస్సులోనే మిక్కిలి లోకానుభవంతో జనరంజకమైన కార్టూన్లను వేసి ఇళయరాజా సీనియర్ కార్టూనిస్టుల అభినందనలు అందుకున్నాడు. కరోన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఈ యువ కార్టూనిస్ట్ వందకు పైగా కార్టూన్ లు వేసి సామాజిక మాధ్యమాల ద్వారా కోవిడ్ పట్ల ప్రజల్లో నిరంతరం చైతన్యం కలిగించాడు. ఇటీవల మహిళలపై పెచ్చుపెరుతున్న అత్యాచారాలను వ్యతిరేకిస్తూ ఆలోచనాత్మకమైన కార్టూన్ లను కూడా వేశాడు. ఊరి శిక్షకు సిద్ధమవుతున్న ఖైదీని ఆఖరి కోరిక ఏమిటని ప్రశ్నిస్తే, “ఒక సెల్ ఫోన్ ఇవ్వండి వాట్సాప్ లో స్టేటస్ పెట్టాలి ” అని అన్నట్టుగా ఇళయరాజా వేసిన కార్టూన్ ఎంతోమందిని ఆకట్టుకుంది. సామాజిక మాధ్యమాల ప్రభావ తీవ్రతను ఇళయరాజా అద్భుతంగా కార్టూనుల్లో తేటతెల్లం చేశాడు.

Young cartoonist Nakka Ilayaraja

కార్టూన్ లను లోకానికి అందించి
సెలవంటూ..

ఇళాయరాజా తన అనారోగ్యాపరిస్థితిని అర్ధం చేసుకున్న ఇళయరాజా “నాకు టైమ్ లేదు మమ్మీ “ఇంకా మరిన్ని కార్టూన్ లు వేయాలి” అంటూ గత పది రోజులవరకు అప్రతిహతంగా తన కార్టూన్ కళా యజ్ఞంలోనే ప్రతిక్షణాన్ని గడిపి, జనవరి 16 వ తేదీ గుండెపోటుతో మరణించాడు. కేవలం 26 సంవత్సరాల వయస్సులోనే, తనకళాసాధనాస్థావరం ‘వీల్ చైర్’ ను విడనాడి ‘భస్మ సింహాసనాన్ని అధిరోహించాడు. ‘చిన్నారి పూవు రాలిపోతూ కాపు ను వాగ్దానం చేసింది” అని శివసాగర్ అన్నట్లుగా అమూల్యమైన తన కార్టూన్ లను లోకానికి అందించి ఇళయరాజా సెలవంటూ వెళ్లిపోయ ఇళయరాజా వేసిన వందలాది కార్టూన్ లను రమణీయం వెలువరించటమే అతనికి నిజమైన నివాళి. Young cartoonist Nakka Ilayaraja

Dr Koyi Koteswar rao

డాక్టర్ కోయి కోటేశ్వర రావు
9440480274

Leave A Reply

Your email address will not be published.

Breaking