Header Top logo

కేసుగారి రాములు గారి ముదిరాజ్ చైతన్య గీతం

ముదిరాజ చైతన్య గీతం

ఓ ముదిరాజన్న
ఓహో తెనుగన్నా
ఓ ముత్తరాశన్న
ఓహో తెనుగన్నా
మేలుకోరన్నా
నీ బతుకు మార్చుకోరన్న
నీ బతుకు మార్చుకోరన్నా
ఓ ముదిరాజన్న
ఓహో తెనుగన్న
ఓహో తెనుగన్నా .

మనవాళ్లు రాజ్యాలు ఏలినారటన్నా
ఆ రాజ్యలిపుడు
ఏమి అయినాయన్నా
గతములోని మన
ఘన కీర్తి చాటరన్నా
ముదిరాజుల బలముతో తిరుగుబాటు చేయన్నా
ఓ ముదిరాజన్న
ఓహో తెనుగన్నా .

మనవాళ్లు ఎక్కడున్నా
వెదకి చూడరన్నా
వెదకి వెదకి అందరినీ ఏకముగా చేయన్నా
ఏకమైన శక్తినీ
ఎవ్వరడ్డు కోలేరన్నా
ఆ శక్తి నీ కుందన్న
దాన్ని వ్యక్త పరచుమన్న
దాన్ని వ్యక్త పరచుమన్నా
ఓ ముదిరాజన్న
ఓహో తెనుగన్నా .

బుద్ది బలము గుండె బలము
పెంచుకోరన్నా
ధైర్యముతో నిలబడితే విజయము నీదేనన్నా
సాహసము చేయరన్న
సఖ్యత కలిగుండన్న
ముదిరాజుల ఖ్యాతినీ మూలలకు చాటన్నా
ఓ ముదిరాజన్న
ఓహో తెనుగన్నా .

వెనకాల నిలబడితే
వెనుకనే ఉంటావు
అడుగు ముందుకేసితే
అందరు నీ తోడుంటారు
ముదిరాజులందరినీ
ముందుకు నడిపించి
రాజ్యాధికారముతో
రాజులుగా నిలబడదాం
రాజులుగా నిలబడదాం .

ఓ ముదిరాజన్న
ఓహో తెనుగన్నా
ఓ ముత్తరాశన్న
ఓహో తెనుగన్న
ఓహో తెనుగన్నా
మేలుకోరన్నా
నీ బతుకు మార్చుకోరన్న
నీ బ్రతుకు మార్చుకోరన్నా.

జై ముదిరాజ్ !
జై జై ముదిరాజ్ !!

కేసుగారి రాములు ముదిరాజ్
సిద్దిపేట ( దుబ్బాక )
9542544865

Leave A Reply

Your email address will not be published.

Breaking