Header Top logo

Missile Man’s birthday on October 15 ప్రపంచ విద్యార్థుల దినోత్సవం

Missile Man’s birthday on October 15

అక్టోబర్ 15… మిస్సైల్ మ్యాన్ జయంతి.. భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిన అబ్దుల్ కలామ్

ప్రపంచ విద్యార్థుల దినోత్సవం

అబ్దుల్ కలామ్.. ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడంటే ఆశ్చర్యం లేదు. భారతదేశ ఖ్యాతిని  ప్రపంచానికి చాటిన మహనీయుడు ఆయన. ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి.. నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన జీవిత ప్రస్థానం నిజంగా అద్భుతం. దేశం కోసం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయిన ఆయన జీవితం ఆదర్శం. అనితర సాధ్యమైన విజయాలను తన ఖాతాలో వేసుకోవడం గొప్పతనం. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన కలాం. హార్ట్ స్టంట్ రూపొందించడం లోనూ పాత్ర పోషించారు.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం. భారతదేశంలో ఉన్న అతికొద్దిమంది గొప్ప శాస్త్రవేత్తల్లో ఏపీజే అబ్దుల్ కలాం ఒకరు. ఆయన జయంతి ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటారు. అబ్దుల్ కలాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం లో ఒక ముస్లిం కుటుంబంలో 1931 అక్టోబర్ 15న జన్మించాడు. తండ్రి పేరు జైనలబుద్దిన్ మరాకాయర్, తల్లి పేరు అషియమ్మా జైనబుల్బుద్దిన్. అబ్దుల్ కలాం  పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం ఆర్థికంగా వెనుకబడిన, కుటుంబానికి సహాయం చేయడానికి చిన్న వయసు లోనే న్యూస్ పేపర్లు వేసేవాడు. రామేశ్వరానికి కొద్ది దూరంలో ఉన్న రామనాథపురంలో స్కెచ్ మెట్రిక్యులేషన్ స్కూల్లో పదో తరగతి వరకు చదువు కున్నాడు. చదువు అంత అంత మాత్రమే అయినప్పటికీ నేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఉండేది. స్కూల్లోనే ఉపాధ్యాయుడు ఒకసారి సముద్రపు ఒడ్డుకు తీసుకువెళ్లి పక్షి ఎలా ఎగురుతుందో  చూపించాడు. అప్పటి నుండి  కలాం  కూడా పక్షిలా ఎగరాలను కున్నాడట. ఎలాగైనా పైలెట్ కావాలని అనుకున్నాడు. తరువాత తిరుచ్చిలో  సెయింట్ జోసెఫ్ కళాశాలలో డిగ్రీ పట్టా పొందాడు. కలాం తన చిన్ననాటి కోరిక నిజం చేసు కోవడానికి మద్రాసులోని ఎన్ఐటీల్లో చేరాడు. ఐతే ఇన్స్టిట్యూట్ లో చేరాలంటే వెయ్యి రూపాయలు ఫీజు కట్టాల్సి వచ్చింది.

కానీ ఆయన తండ్రి దగ్గర లేనపుడు  కలాం  అక్క తన రెండు  గాజులు అమ్మి ఫీజ్ కట్టింది.   ఎలాగైనా బాగా చదివించాలని ఉన్నతమైన స్థానంలో చూడాలని తన కుటుంబ సభ్యులు పడుతున్న కష్టాన్ని తన మీద వాళ్లకు నమ్మకాన్ని చూసి చలించి పోయాడు. చివరకు స్కాలర్షిప్ సహాయంతో ఎం ఐ టి  లో  ఎరోనాటికల్ ఇంజనీరింగ్  పూర్తి చేయగా, అందులో నాటికల్ ప్రవేశ పరీక్షల్లో 8 ఉద్యోగాలు ఉంటే తనకు 9వ స్థానం రావడంతో తృటిలో పైలెట్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. కలాం తన చిన్ననాటి కల చేజారి పోయింది. 1960 కలాం డీఆర్డీఓ (DRDO)లో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లో శాస్త్రవేత్తగా చేరారు. అక్కడ భారత సైన్యం కోసం ఒక ఓవర్ క్రాఫ్ట్ డెవలప్ చేయడం ఆయన పని. కొన్ని రోజులకి ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ నుండి కలాం కి ఇంటర్వ్యూకు రమ్మని పిలుపు  వచ్చింది. ఇప్పుడు దీనినే ఇస్రోగా (ISRO) పిలుస్తున్నారు. ప్రొఫెసర్ విక్రం సారాభాయ్ ఇంటర్వ్యూ చేశారు. అలా కలాం రాకెట్ ఇంజినీరుగా సెలక్ట్ అయ్యారు. విక్రం సారాభాయ్, కలాం  కలిసి ఇస్రో ను ఎంతగానో అభివృద్ది చేశారు.  1962లో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో చేరి,   ఇతర శాస్త్రవేత్తలతో కలసి అనేక కృత్రిమ ఉపగ్రహాలను విజయ వంతంగా ప్రయోగించారు. రోహిణి ఉపగ్రహాన్ని జూలై 1980లో విజయవంతంగా భూమి సమీప కక్ష్యలోకి వదిలిన భారత దేశపు తొలి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III)ని అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు డైరెక్టరుగా ఆయన కృషి ఎంతో ఉంది.

abdul khalam 3

శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం. క్రమంలో ఆరు నెలలపాటు రాకెట్ లాంచింగ్ టెక్నిక్ మీద ట్రైనింగ్ కోసం అమెరికాలోని “నాసా” వెళ్లే అవకాశం దక్కింది. భారత్ నుండి అంతరిక్షంలోకి శాటిలైట్ పంపాలనేది ప్రొఫెసర్ సారాభాయ్   కోరిక. శిక్షణ పూర్తి అయిన తర్వాత కలాం… సారాభాయ్ మరియు సతీష్  సహకారంతో “రోహిణి” అనే శాటిలైట్ ని అంతరిక్షంలోకి పంపడానికి ఎస్ఎల్వి-3 అనే   రాకెట్ ని అభివృద్ధి చేశారు. దేశంలోని ప్రజలందరికీ ఎస్ఎల్వి-3 మీదే కళ్ళు ఉన్నాయి. కలాంతో  పాటుగా అక్కడ ఉన్న ఎంతోమంది కష్టపడి నిర్మించిన 22 మీటర్ల పొడవైన  ఎస్ఎల్వి-3  లాంచ్ అయింది.  315 సెకండ్ తర్వాత సెకండ్ స్టేజ్ పేలిపోయి సముద్రంలో కుప్పకూలి పోయింది.  కలాంకు ఏదో తెలియని ఆవేదన. దేశ ప్రజల అందరి కళ్లు ఆవిరై పోయాయి. మళ్ళి తిరిగి 1980 2 వ  ఎస్ఎల్వి-3   రెడీ చేశారు. మొదటి దాని లాగానే ఇది కూడా ఫెయిల్ అవుతుందని వ్యాఖ్యానించారు. 18 జూలై 1980 లో ఎస్ఎల్వి-3 రోహిణి విజయ వంతంగా ప్రవేశ పెట్టింది..అంతరిక్షం లోకి శాటిలైట్ ని పంపగలిగే కెపాసిటీ ఉన్న దేశాల లిస్టులో భారతదేశం కూడా చేరింది. భారత అంతరిక్ష ప్రయోగాలు పునాదులు పడ్డాయి. ఆ నాటి  ప్రధానమంత్రి  గాంధీ ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. ఆ తర్వాతి సంవత్సరం 1981లో కలాంకు  పద్మభూషణ్ అవార్డు దక్కింది.

ఆ తరవాత మన ఆర్మీ కోసం అగ్ని, పృధ్వి, నాగ్, ఆకాశ్ త్రిశూల్ వంటి శక్తివంతమైన మిస్సైల్ లు తయారు చేసి మన దేశాన్ని ఎవరి మీద ఆధారపడని ఒక శక్తివంతమైన దేశంగా మార్చారు. అందుకే  కలాంను మిసైల్ మాన్  అంటారు. ఆయన నాయకత్వంలో ఇస్రో ఎంతో అభివృద్ధి చెందింది. 1982లో, ఆయన డీఆర్డీవో డైరక్టరుగా తిరిగి బాధ్యతలు చేపట్టి గైడెడ్ మిస్సైల్స్‌పై దృష్టి కేంద్రీకరించారు. అగ్ని, పృథ్వి, క్షిపణి మిస్సైళ్ళ అభివృద్ధి చేసి ప్రయోగించడంలో కీలక పాత్ర పోషించారు. అంటే దేశానికి తొలి మిస్సైల్‌ను అందించిన ఘనత ఆయనదే. అందుకే ఆయనకు “మిస్సైల్ మాన్” అనే పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత జూలై 1992లో దేశ రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు. అలాగే, భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా కేబినెట్ హోదాలో కొనసాగారు. అబ్దుల్ కలాం కృషి ఫలితంగా 1998లో పోఖ్రాన్-II అణుపరీక్షలు విజయ వంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ అణు పరీక్షతో భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగ స్వామిగా ఆయన్ను “మిస్సైల్ మాన్” అని పిలుస్తారు. 1898లో వాజ్ పేయి ప్రధానమంత్రి  సమయంలో అమెరికన్ శాటిలైట్ష్ కి దొరకకుండా “పోక్రాన్” అనే ప్రదేశంలో “ఆపరేషన్ శక్తి” అనే పేరుతో విజయవంతంగా న్యూక్లియర్ టెస్ట్ చేయడంలో  కలాం పాత్ర ఎంతగానో వుంది.

గత ఎన్డీయే ప్రభుత్వ హయాంలో వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో అంటే 2002 జూలై 18వ తేదీన భారత రాష్ట్రపతిగా ఎన్నిక కాగా, జూలై 25న రాష్ట్రపతి భవన్‌లో అడుగు పెట్టారు. ఆయనకు నాటి ఎన్డీయే మిత్రపక్షాలతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడంతో 90 శాతానికి పైగా ఓట్ల మెజార్టీతో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అబ్దుల్ కలాం  మన దేశానికి ఏ రాజకీయ అనుభవం లేకుండా పదకొండవ రాష్ట్రపతిగా ఎన్నికైన జ్ఞాని. కలాం సమయంలో ఎక్కవ మందిని కలుసుకున్న రాష్ట్రపతిగా,  పీపుల్స్ ప్రెసిడెంట్ అని అంటారు. అబ్దుల్ కలాం గారు పెళ్లి చేసుకోలేదు. అంతేకాదు, వైద్య రంగంలో పోలియో బాధితుల కోసం, తేలికపాటి పరికరాల రూపకల్పన చేయడానికి ఎంతో కృషి చేశారు. భారత ప్రభుత్వం “భారతరత్న”‘ “పద్మవిభూషణ్”, “పద్మభూషణ్” పురస్కారాలతో గౌరవించింది. అబ్దుల్ కలాం పూర్తిగా శాకాహారి. మధ్యపాన వ్యతిరేకి. బ్రహ్మచారి. మత ఘర్షణలను నిరసించే శాంతి కాముకుడిగా పేరు గడించారు. ఈయన వింగ్స్ ఆఫ్ ఫైర్, సైంటిస్ట్ టు ప్రెసిడెంట్‌ వంటి అనేక పుస్తకాలను రచించారు.  84 సంవత్సరాల వయసులో  జూలై 27, 2015 సోమవారం సాయంత్రం షిల్లాంగ్‌లోని ఏఐఎంలో  విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్‌ అబ్దుల్‌ కలాం మధ్యలో కుప్పకూలి పోయి, స్థానిక బెథాని ఆస్పత్రికి తరలించబడి, 45 నిమిషాల వ్యవధిలోనే  కన్నుమూశారు.

Ramakistaiah sangabhatla

రామ కిష్టయ్య సంగన భట్ల

9540595494

Leave A Reply

Your email address will not be published.

Breaking