Header Top logo

Blackmail in the name of journalism జర్నలిజం పేరిట దసరా మాముళ్లు

Blackmail in the name of journalism

జర్నలిజం పేరిట దసరా మాముళ్లు.. ఇవ్వక పోతే బ్లాక్ మెయిలింగ్

జర్నలిజం.. ఒకప్పుడు ఈ జర్నలిజం పేరు చెబితే ఎంతో గౌరవం.. సమాజంలో జరిగే అవినీతి, అక్రమాలపై కలాన్ని ఆయుధంలా మార్చి వార్తలను తుపాకి తూటాలుగా పేల్చుతారనే భయం.. కానీ.. నేడు ఆ జర్నలిజం అంగట్లో దొరికే వేశ్యలా మారింది. గూంఢలు.. రౌడీలు.. హంతకులు కూడా ఈ జర్నలిజం కార్డును పెట్టుకుని పబ్బం గడుపుతున్నారు.. అలాంటి వాళ్లను ప్రొత్సహించేది మాత్రం అన్నీ తెలిసిన సీనియర్ జర్నలిస్టులే.. సోషల్ మీడియా డామినెట్ చేస్తున్న ఈ కలికాలంలో తప్పు చేసింది ఎవరైనా పోస్ట్ లు పెట్టి ఆట ఆడుకుంటున్నారు. ఇగో.. ఈ క్రింది వార్త కథనం కూడా జర్నలిజం ముసుగులో ‘బ్లాక్ మెయిల్’ చేస్తూ పరువు తీస్తున్న నకిలి జర్నలిస్ట్ ల గురించి బాగా రాసారు. ఆ మ్యాటర్ రాసిన పెద్దాయన పేరు పెట్టుకోక పోయినా.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నమ్మడం లేదా..? అయితే.. ఈ క్రింది మ్యాటర్ ను మీరే చదువండి..

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

దసరా లో నకిలీ విలేకరులతో బెంబేలు.. ప్రజాప్రతినిధులు, ఇతరులను బ్లాక్ మేల్ చేయటమే వారి లక్ష్యం. సంవత్సర కాలంగా జర్నలిస్టులు గా కష్టపడుతున్న  వారికి మచ్చ  తెచ్చే విధంగా నకిలీలు.జర్నలిస్టుల మద్య ఆధిపత్య పోరు, వర్గ పోరుతో.. నష్టపోతున్న మీడియా మిత్రులు. వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుడు విగ్రహం పెట్టుకొని నవ రాత్రులలో ప్రత్యేక పూజలు చేయటం మనం చూసాం. అలాగే విజయ దశమి సందర్భంగా కనకదుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోని కూడా నవ రాత్రులు జరపడం కూడా చూశాం… కానీ ఇప్పుడు అంతకు మించి…. ఓ… కొత్త ట్రెండ్ నడుస్తుంది..

రాష్ట్ర వ్యాప్తంగా  ఎక్కువ శాతం డిపార్ట్ మెంట్ లలో దసరా పండుగ కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ పండుగ రాగానే.. ఓ సాంప్రదాయం ప్రకారం ప్రభుత్వ, ప్రయివేటు, కార్యాలయాలతో పాటు..అన్ని కార్మిక రంగాల్లో యజమానులు నుండి సంతోషంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందజేసే సాంప్రదాయం కొనసాగుతోంది. అది కూడా కార్మికులు తాను కష్ట సుకాల్లో  భాగస్వామ్యం అవుతూ యజమాని  కి కార్మికులకు  మద్య మంచి సంబంధాలు కొనసాగించడం కోసం సంతోషంతో .. బట్టలు, స్వీట్స్, పండ్లు,  కొంత మంది ఆర్థిక సహాయం అందజేస్తూ ఉంటారు.  కానీ ఇప్పుడు అది కొందరి నకిలీలకు వరంగా. మరి కొందరికి భారంగా మారింది. ఏ ఇతర రంగాల్లో  అయినా కార్మికులకు మంచి గుర్తింపు ఉంటుంది. కానీ జర్నలిజం వృత్తి లో మాత్రం  సంవత్సరం పాటు సంస్థ కు యాడ్స్ ఇవ్వడం తో పాటు వార్తలు సేకరణ నిరంతరం కష్టపడే జర్నలిస్టులకు మాత్రం.. గుర్తింపు రాకపోవడంతో పాటు  నలుగురు నవ్వుకునే విధంగా కొంత మంది వ్యవహారించటంతో ప్రజాప్రతినిధులకు తల నొప్పి గా మారడంతో పాటు  ప్రజా ప్రతినిధులు ఆర్థిక ఇబ్బందులకు గురౌతున్నారు.  మండలం, నియోజకవర్గం లో సంవత్సరం కాలం పాటు వార్తలు రాస్తున్న వారికి తల వంపులు తెచ్చే విధంగా నకిలీ (దసరా) నవ రాత్రుల…విలేకరుల .. దెబ్బ కు  జర్నలిస్టులు అంటే వామ్మో అనే విధంగా భయ బ్రాంతులకు గురౌతున్నారు. వీరిని కట్టడి చేసేందుకు జర్నలిస్టులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ, ప్రభుత్వ అధికారులు గానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోక పోవడంతో.. దసరా జర్నలిస్టులు… తాకిడి కి… పల్లెలు వదిలి పట్టణాలకు పోయే పరిస్థితి ఉంది.. రైతుల కష్టాన్ని దళారులు దోచుకున్నట్లు… వర్కింగ్ జర్నలిస్టుల కష్టాన్ని… దసరా విలేకరులు దోచుకుంటున్నారు.

 జర్నలిస్టులలో ఐక్యత లేకపోవడం వల్లే స్థానిక జర్నలిస్టులలో ఐక్యత లేకపోవడం తో పాటు ఆధిపత్య పోరు, వర్గపోరుతో విడి విడిగా ఉండటంతో  అనేక సంవత్సరాలుగా  కష్టపడుతూ అనేక ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరిగిందని జగమెరిగిన సత్యం..  వాటిని నిలువరించేదెవరు జర్నలిస్టులా..? ప్రజాప్రతినిధులా..? అధికారులా..? అనేది అంతు చిక్కని సమాధానం గా మిగిలింది. బాధ్యత మనది … హక్కులు కాపాడుకోవటం మనందరి బాధ్యత..!! 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking