Header Top logo

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ టెర్రరిస్ట్

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్‌ను ఎన్ఐఏ టార్గెట్ చేసింది. అతనిని ఎలాగైనా పట్టుకోవాలని నిర్ణయించింది. నక్సలైట్ ఉద్యమంలో పని చేస్తున్న గణేష్ ఉగ్రవాది అంటూ ఏఓబీలో వాల్ పోస్టర్లు వెలిశాయి. అతనిని పట్టిస్తే పది లక్షల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు పోలీసులు.

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్‌ది జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల. గ్రామీణ ప్రాంతాలలో పెరిగిన పెత్తందారి విధానం నచ్చక 1992లో నక్సల్స్ ఉద్యమం బాట పట్టాడు గణేష్.

నక్సలైట్ల సమస్య శాంతి భద్రతల సమస్య కాదని భావించిన వైఎస్ ప్రభుత్వం 2004లో నక్సలైట్లతో చర్చలు జరిపింది. పీపుల్స్ వార్ ప్రతినిధిగా రామక్రిష్ణతో పాటు గణేష్ కూడా ప్రభుత్వం జరిపిన చర్చలో పొల్గొన్నారు.

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్

గాజర్ల రవి అలియాస్ ఉదయ్ సోదరులు కూడ మావోయిస్టు ఉద్యమంతో సంబందాలున్నాయి. ఈ కుటుంబంలోని ముగ్గురు సోదరులు మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు. గాజర్ల కుటంబంలోని ముగ్గురు కూడ పోరుబాట పట్టారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని వెలిశాల గ్రామానికి చెందిన రవి అలియాస్ గణేష్, ఆయన సోదరుడు ఆజాద్ అలియాస్ ఐతు అలియాస్ ఆశోక్ లు మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఎదిగారు.
అప్పటి పీపుల్స్ వార్ పార్టీ. నేటి మావోయిస్టు పార్టీలో ఈ కుటుంబం కీలకంగా వ్యవహారించడానికి గ్రామంలోని పెత్తందారీ వ్యవస్థే కారణమైంది.   గాజర్ల మల్లయయ్, కనకమ్మ దంపతులకు రాయ్య, సమ్మయ్య సారయ్య,రవి, ఆశోక్ లు సంతానం. వీరిలో సారయ్య,రవి, ఆశోక్ లు మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు.
ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమిలో వ్యవసాయం తో పాటు గీత వృత్తిని చేస్తూ జీవనం సాగించేది కుటుంబం.1987 లో జరిగిన సింగిల్ విండ్ ఎన్నికల్లో ఆజాద్ డైరెక్టర్ పదవి కోసం పోటీచేశారు. అయితే తన ప్రత్యర్థి నల్ల కృష్ణారెడ్డి ఈ ఎన్నికల్లో విజయం సాదించారు.
కృష్ణారెడ్డి విజయానికి అప్రజాస్వామ్యంగా వ్యవహరిచండమే కారణమని ఆజాద్ భావించారు.1989 లో పీపుల్స్ వార్ లో చేరారు. ఆ తర్వాత 1992 లో గణేష్ కూడ పీపుల్స్ వార్ లో చేరారు.1994 లో ఆశోక్ కూడ సోదరుల బాటలోనే నడిచాడు.

Leave A Reply

Your email address will not be published.

Breaking