మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్‌ను ఎన్ఐఏ టార్గెట్ చేసింది. అతనిని ఎలాగైనా పట్టుకోవాలని నిర్ణయించింది. నక్సలైట్ ఉద్యమంలో పని చేస్తున్న గణేష్ ఉగ్రవాది అంటూ ఏఓబీలో వాల్ పోస్టర్లు వెలిశాయి. అతనిని పట్టిస్తే పది లక్షల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు పోలీసులు.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్‌ది జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల. గ్రామీణ ప్రాంతాలలో పెరిగిన పెత్తందారి విధానం నచ్చక 1992లో నక్సల్స్ ఉద్యమం బాట పట్టాడు గణేష్.
నక్సలైట్ల సమస్య శాంతి భద్రతల సమస్య కాదని భావించిన వైఎస్ ప్రభుత్వం 2004లో నక్సలైట్లతో చర్చలు జరిపింది. పీపుల్స్ వార్ ప్రతినిధిగా రామక్రిష్ణతో పాటు గణేష్ కూడా ప్రభుత్వం జరిపిన చర్చలో పొల్గొన్నారు.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్