- 30 ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం అంటూ కేటీఆర్ విమర్శ
- దేశంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయని ట్వీట్
- ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఎల్పీజీ ధరలు ఉన్నాయని వ్యాఖ్య
కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ సర్కారు అని పిలవాలా? లేక ఎన్‌పీఏ (నిరర్థక సంపద) ప్రభుత్వం అని పిలవాలా? అని కేటీఆర్ నిలదీశారు. ఎన్‌పీఏ అంటే (నాన్ పర్ఫార్మింగ్ అసెట్-నిరర్థక ఆస్తి) అని భక్తులకు (బీజేపీ అభిమానులకు) వివరించి చెబుతున్నానంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలోని పరిస్థితులను వివరిస్తూ ఓ ఇంగ్లిష్ పత్రికలో వచ్చిన కథనాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ పోస్ట్ చేశారు.
దేశంలో నెలకొన్న నిరుద్యోగ పరిస్థితులు, పెరిగిపోతోన్న నిత్యావసర సరుకుల ధరలు, ద్రవ్యోల్బణం, తగ్గుతోన్న ఆదాయం, కొనుగోలు శక్తి వంటి అంశాలను అందులో పేర్కొన్నారు. భారతీయ రిజర్వు బ్యాంకు చేపట్టిన ఓ సర్వేలో ఆయా విషయాలు వెల్లడయ్యాయని ఆ కథనంలో చెప్పారు. ఆయా అంశాలనే మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు.