Header Top logo

Karl Marx‌- Jenny’s Love Story కారల్ మార్క్స్‌- జెన్నీల లవ్ స్టోరీ

Karl Marx‌- Jenny’s Love Story

కారల్ మార్క్స్‌- జెన్నీల లవ్ స్టోరీ

marks marriege

ఆమె విఫ్లవానికి మనసిచ్చింది

ఈ రోజు జెన్నీ వాన్‌ వెస్ట్‌ పాలేన్‌ వర్థంతి. ఈనాడు, ఆనాడు కూడా పెట్టుబడిదారుల గుండెల్లో దడపుట్టించే పేర్లల్లో జెన్నీ మార్క్స్‌ పేరు ఒకటి. జెన్నీ మార్క్స్ ను ప్రేమించింది. ఆయన జీవిత సహచరి అయింది. రాజకీయాల్లోను సహచర్యం అందించింది. వారి ప్రేమ మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు మహారాజుల ప్రేమగాథలు, పుక్కిటిపూరాణం లాంటిది కాదు. తాజ్‌మహల్‌ కట్టించిన షాజహాన్‌, ముంతాజ్‌ల ప్రేమ లాంటిది అసలే కాదు. ‘తాజ్‌మహాల్‌ నిర్మాణంలో రాళ్ళెత్తిన కూలీలెవరోరు’ అని ప్రశ్నిస్తాడు శ్రీశ్రీ. ఆ కూలీలను శ్రమ దోపిడీ నుంచి విముక్తులను చేసేందుకు అంకితమైన ప్రేమ జెన్నీ- మార్క్స్ లది.

గొప్ప తత్వవేత్త కారల్‌మార్క్స్‌

ఈ భూతలంలో కొంత మంది తమకోసమే, తమ విలాసాల కోసమే బతుకుతారు. మరి కొందరు ప్రజల కోసమే బతుకుతారు. తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, రాజకీయవేత్తలు, ఎంతో మంది మానవాళికి ఎనలేని మేలుచేసిన వాళ్ళు ఉన్నారు. అంటువంటి తత్వవేత్తల్లో గొప్ప తత్వవేత్త కారల్‌మార్క్స్‌. మార్క్స్‌ సిద్ధాంతం శ్రామికులను అధికార పీఠంపై కూర్చోపెట్టింది. అట్టి గొప్ప తత్వవేత్త కారల్‌ మార్క్స్‌ను వరించింది జెన్నీ. జెన్నీలేని మార్క్స్‌ లేడు. గొప్ప తత్వవేత్త కారల్‌ మార్క్స్‌ లేని మార్క్సిజం లేదు. మార్క్సిజం కానిది కార్మిక వర్గ సిద్ధాంతం కాదు. ఆ సిద్ధాంతం లేకుండా శ్రమదోపిడీ నుంచి కార్మిక వర్గానికి విముక్తి లేదు. ఆ సిద్ధాంత కర్తను, ఆయనతో పాటే ఆయన పడ్డ కష్టాలనూ వరించిన జెన్నీ జీవిత విశేషాలు తెలుసుకోవాలి.

జెన్నీ జీవిత విశేషాలు.. జెన్నీ పూర్తి పేరు జోహన్న బెర్త జూలీ జెన్నీ వాన్‌ వేస్ట్‌ఫాలేన్‌. 1814 ఫిబ్రవరి 12న జర్మనీలో పుట్టింది. 1881 డిసెంబర్‌ 2న తన 67వ యేట లండన్‌లో మరణించింది. జెన్నీ తల్లీదండ్రులు ధనవంతులు. జర్మనీని ప్రష్యా అనేవాళ్ళు. జెన్నీ తండ్రి లుడ్విగ్‌ వాన్‌ వేస్ట్‌ ఫాలేన్‌ రాజోద్యోగి. జెన్నీ సోదరుడు ఎడ్గార్‌ కారల్‌ మార్క్స్‌ స్నేహితుడు. మరో సోదరుడు ఫెర్డ్డినాండ్‌ ప్రష్యారాజుకు అత్యంత సన్నిహితుడు, మంత్రి.

జెన్నీ, కారల్‌ మార్క్స్‌ స్నేహితులు

జెన్నీ, కారల్‌మార్క్స్‌ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. చదువుల్లో ఆరితేరినవారు. జెన్నీ గొప్ప అందగత్తె. మార్క్స్‌ తండ్రి అదే పట్టణంలో ప్రముఖ లాయరు. ఆయన, జెన్నీ తండ్రి లుడ్విగ్‌ మంచి స్నేహితులు. జెన్నీ మార్క్స్‌ కన్నా నాలుగైదు సవంత్సరాలు పెద్ద. అయినా వారి భావాలు వారిని దగ్గర చేశాయి. అదే వారి మధ్య ప్రేమకు దారితీసింది. వారి ప్రేమ మన సినిమాల్లో మాదిరి రసవత్తర ప్రేమ కథ కాదు. శ్రామికవర్గ విముక్తి కోసం అంకితమైన ప్రేమ. కొంత కాలానికి వివాహం చేసుకున్నారు. కార్ల్‌, జెన్నీలకు ఏడుగురు సంతానం. నలుగురు పిల్లలు పుట్టిన కొంతకాలానికే చనిపోయారు. ముగ్గురు కుమార్తెలు. జెన్నీ, లారా, ఎలియానార్‌లు. అమ్మనాన్నలాగా కార్మిక, రాజకీయ ఉద్యమాల్లో చేరి తోటి కార్యకర్తలని వివాహం చేసుకున్నారు.

Karl Marx‌- Jenny's

రాజుకు మరణశిక్ష

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కథ 1810-1890 మధ్యకాలంలోనిది. ఆనాటి సామాజిక రాజకీయ పరిస్థితులు మనకి అర్థం కాకపోతే జెన్నీ, మార్క్స్‌ల జీవితం కూడా అర్థం కాదు. 1750లో ఫ్రెంచి విప్లవం వచ్చింది. లక్షలాది శ్రామిక జనం పోరాటం చేసిన ఫలితంగా రాచరికం కుప్పకూలింది. సామాన్య జనమే తిరగబడి రాజుకు మరణశిక్ష వేశారు. ఆ తిరుగుబాటు మొత్తం ప్రపంచంలో దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తిరగబడాలనే భావాలు రేకెత్తించింది. స్వేచ్ఛ, సమానత్వం, నినాదాలు అప్పుడే మొదలైయ్యాయి. ఫ్రాన్స్స్ కు పక్కనే ఉన్న ప్రష్యా రాచరికంలోనే ఉంది. అయినా రాచరికానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఆలోచనలు మొదలయ్యాయి.

Karl Marx‌- Jenny's

మార్క్స్‌ పై ఆలోచనల ప్రభావం

ఇంగ్లాండ్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, బెల్జియం వంటి దేశాలల్లో సోషలిస్టు భావాలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రారిశ్రామికీకరణతో కార్మిక వర్గం – విప్లవ వర్గం ఆవిర్భవించింది. మహా మేధావి మార్క్స్‌ పై ఈ కొత్త ఆలోచనల ప్రభావం పడింది. ఒక న్యాయవాది కొడుకు. అధికార దర్పాలను, విలాసవంతమైన జీవితాన్ని కోరుకోలేదు. తన మేధస్సుకు పదును పెట్టాడు. అధ్యయనం పెంచాడు. కార్మికుల పోరాటాలను, నియంతృత్వ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సాగే ప్రతిఘటనలను పరిశీలించాడు. క్రమంగా వాటితో మమేకమై పని చేయడం ప్రారంభించాడు. తన రచనా వ్యాసంగాన్ని ఆయుధంగా మార్చుకొన్నాడు. కార్మికవర్గ విముక్తి తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు. పెట్టుదారీ ప్రభుత్వాలు ఆయన పట్ల ద్వేషం పెంచుకున్నాయి. ఆయనను ఎక్కడా నిలవనీయలేదు. సొంత దేశం అయిన జర్మనీ నుంచి తరమివేశారు. పారిస్‌లో తల దాచు కున్నాడు. అక్కడా ఉండనియ్య లేదు. బ్రస్సెల్స్‌ చేరుకున్నాడు. అక్కడి ప్రభుత్వం కూడా తరిమి వేసింది. చివరికి లండన్‌ నగరంలోని మురికి వాడల్లో, కార్మిక వాడల్లో కాపురం పెట్టాడు.

దేశ బహిష్కరణలకు గురయ్యారు.. ఈ కాలంలో జెన్నీ, మార్క్స్‌ ల సంసారం ఎలా సాగిందో ఊహాతీతం. రాచ బిడ్డ జెన్నీ. ఆమె కోరుకుంటే రాజపుత్రుడే భర్తగా దొరికేవాడు. కానీ ఆమె జీవితాశయం వేరు. మార్క్స్‌ ను ప్రేమించింది. మార్క్స్‌ భావాలను ప్రేమించింది. ఎన్ని కష్టాలైనా భరించింది. పేదరికం వారిపై కక్షగట్టింది. స్థిరమైన నివాసంలేక దేశ బహిష్కరణలకు గురయ్యారు. వలస పక్షుల్లాగా ఎన్ని దేశాలు తిరిగారో? కన్న బిడ్డలకు కడుపునిండ తిండిలేక వైద్యం చేయించే స్తోమత లేక నలుగురు బిడ్డలను పోగొట్టుకున్నారు.

Karl Marx‌- Jenny's

మృత్యువుతో పోరాడింది

”పాపం ఆ పసిది మూడు రోజులు మృత్యువుతో పోరాడింది. నికృష్టమైన పేదరికం అనుభవిస్తున్నప్పడు మరణించిందా బిడ్డ. మా జర్మన్‌ మిత్రులు సహితం ఆ సమయంలో లేరు. మమ్మల్ని ఆదుకునే స్థితిలో లేరు. దడదడలాడే గుండెతో ప్రక్క శివారులో ఉండే ఒక ఫ్రెంచి ప్రవాసితుని వద్దకు వెళ్ళాను. ఆయన మాకు పరిచయస్తుడు. అత్యంత స్నేహ భావంతోనూ, సానుభూతితోనూ అతను రెండు పౌనులు అందించాడు. దానితో శవపేటిక కొన్నాం. అదిగో అందులో విశ్రాంతి తీసుకుంటున్నది నా బిడ్డ! పుట్టినప్పుడు ఉయ్యాల ఇవ్వలేకపోయాను. తుదకు తుది గూడు కూడా చాలా సేపు సమకూర్చలేకపోయాం” అని మిత్రునికి రాసిన లేఖలో ఈ మాటలు సాధారణ కడగండ్లు, కన్నీరు కాదు. ఇంతకన్న ఏమి చెప్పుకోవాలి! లాక్‌డౌన్‌ కాలంలో వలస కార్మికుల కష్టాలు చూశాం. జెన్నీ – మార్క్స్‌ జీవితం అంతకన్నా మెరుగైంది కాదు. పగవాళ్ళకు కూడా వద్దురా బాబు అనిపించే కష్టాలు పడ్డారు.

Karl Marx‌- Jenny's

మార్క్స్‌ కుటుంబానికి ఎంగెల్స్‌ అండ

మార్క్స్‌ కుటుంబానికి ఎంగెల్స్‌ మైత్రి కొండంత అండ. మార్క్స్‌ మరణనంతరం కూడా మార్క్స్‌ కుంటుంబ బాధ్యతలను ఎంగెల్స్‌ తన భుజాలపై వేసుకున్నాడు. ‘‘జయించటానికి ప్రపంచం ఉంది” అంటూ శ్రామిక వర్గానికి కర్తవ్య బోధ చేసిన కమ్యూనిస్టు ప్రణాళిక 1848లో ప్రచురించారు. కార్మికవర్గానికి అది ఒక దిక్సూచి. అది మొదలు అనేక దేశాల్లో ప్రతిఘటనలు, పోరాటాలు ఎన్నో జరిగాయి. రాచరికాలకు, నియంతృత్వ ప్రభుత్వాలకు, వలసవాద, సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా తిరగబడని దేశమంటూ లేదు. మార్క్స్‌ పుట్టిన దేశంలోనే హిట్లర్‌ పుట్టాడు. సోవియట్‌ సైన్యాల చేతుల్లో కుక్క చావు చచ్చాడు. తెలిసిన చరిత్రే కదా!

revolution

విప్లవోద్యమాలకు ఎదురుదెబ్బలు

తాత్కాలికంగా విప్లవోద్యమాలకు ఎదురుదెబ్బలు తగులుతునే ఉంటాయి. మార్క్స్‌ కాలంలోనూ ఎదురుదెబ్బలు తగిలాయి. విప్లవశక్తులు ఓడిపోయి, ప్రతిఘాత శక్తులు విజృభించిన ప్రతి సారి మార్క్స్‌ దేశ బహిష్కారాలకు గురయ్యాడు. అయినా రాజకీయ అర్థశాస్త్రం, పెట్టుబడి గ్రంథరచన, కార్మిక వర్గ పోరాటాలను ఉచ్చస్థితికి తిసుకేళ్ళడం వారి జీవితాశయం.

 

Karl Marx‌- Jenny's

జెన్నీ విప్లవాన్ని ప్రేమించింది

జెన్నీ మాములు గృహిణి కాదు. ఆమె మార్క్స్‌ ని మాత్రమే ప్రేమించలేదు. విప్లవాన్ని ప్రేమించింది. ఆమె బిడ్డలను మాత్రమే సాకలేదు. రాజకీయ కార్యకర్తలను సాకింది. కమ్యూనిస్టులపై నిందా ప్రచారాలు అప్పుడూ ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. కమ్యూనిజం వచ్చేదాక ఉంటాయి. ”వామ్మో వాయ్యో” అంటూ ఈ కాస్త పనికే యాస్ట పడిపోతే, ప్రఖ్యాత రతయిత తెన్నేటి సూరి ఒక పాటలో చెప్పినట్టు ”అసలు ఎందుకు మొదలెట్టావోరు” అని ప్రశ్న వేసుకోవాలి. అయితే మొదలెట్టాక చేసేదేముంది. దోపిడీ దౌర్జన్యాలను భరిద్దామా? దేశ రాజధానిలో లక్షలాది మంది రైతులు పోరాడుతున్నారు. దోపిడీ ఎక్కడ ఉంటుందో పోరాటం అక్కడే ఉంటుంది. అడుగు ముందుకు వేద్దాం. దోపిడీని అంతం చేద్దాం. జెన్ని-మార్క్స్‌-ఎంగెల్స్‌ ల త్యాగాలను మరవక వారి కలలను నిజం చేద్దాం.

సేకరణ : సోషల్ మీడియా నుంచి .

Leave A Reply

Your email address will not be published.

Breaking