Header Top logo

These rules for pregnant women గర్భిణి స్త్రీల కోసం ఈ నియమాలు

These rules for pregnant women
గర్భిణి స్త్రీల కోసం ఈ నియమాలు

గర్భిణి స్త్రీలు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ఎల్లప్పుడూ మితిమీరి ఆహారాన్ని భుజించకుడదు. సులభంగా జీర్ణం అయ్యే ఆహార పదార్దాలు మాత్రమే తినాలి. తినాలి అనిపించినప్పుడు వీధిలోని పదార్దాలు భుజించ కూడదు. ఇంట్లో చేయించుకొని తినాలి. కొంతైనా శారీరక శ్రమ చేయాలి. ప్రసవించెంత వరకు సామాన్యంగా ఇతరుల ఇళ్ళకు వెళ్ళకూడదు. ముఖ్యంగా చావులు, ఘర్షణలు, గొడవలు జరిగిన ప్రదేశాలకు వెళ్ళకూడదు.

గర్భిణులు పనులు చేయకూడదు

గర్భిణులు బలవంతమైన అతి కష్టమైన పనులు అసలు చేయకూడదు. ఎత్తు ప్రదేశాలు ఎక్కడం , వేగంగా దిగడం చేయకుడదు. కారం, చేదు, ఉప్పు ఎక్కువ ఉన్న పదార్దాలు గర్భిణి లు తినకూడదు. పగలు నిద్రించడం, రాత్రి మేలుకోవడం, అతిగా టీవీ చూడటం, సినిమాలు చూడటం చేయకూడదు.

బిడ్డ మీద ప్రభావం పడుతుంది

మనసుకి ఆందోళన కలిగించే విషయాలు వినకుడదు. నూలు బట్టలు వదులు గా ఉన్నవి ధరించాలి. మనసులో ఈర్ష్య, ద్వేషం , అసూయ లాంటి రజో, తమో గుణాలు కి గురి కాకూడదు. అలా గురి అవ్వడం వలన లోపల బిడ్డ మీద ప్రభావం పడుతుంది. పుట్టే వారు కూడా అవే లక్షణాలతో పుడతారు. గర్భిణి స్త్రీలు చన్నీటి స్నానం చేయకూడదు.ఆరోవ మాసం నుంచి సంభోగంలో పాల్గొనకుడదు. సంభోగం నుంచి ఆలోచనలు రాకూడదు. సంభోగం లో పాల్గొనడం వలన గర్భ స్రావాలు, 8 మాసాలకే ప్రసవాలు, మృత శిశువులు పుట్టడం ఒక్కోసారి తల్లి ప్రాణానికి కూడా ప్రమాదం వాటిల్లడం జరుగుతుంది. గర్భిణి స్త్రీ ఎట్టి పరిస్థితుల్లోను కొబ్బరి బొండాలు తాగ కూడదు.

These rules for pregnant women

కొబ్బరి బొండాల నీళ్లు తాగోద్దు

అలా తాగడం వలన అప్పుడే నెల తప్పినా, మూడు లేకా నాలుగు మాసాల గర్భవతిగా ఉన్నా లేత కొబ్బరి బొండాల నీళ్లు తాగడం వలన గర్భ స్రావాలు జరుగుతాయి. నువ్వులతో చేసిన కజ్జికాయలు, నువ్వుల నూనెతో వండిన పిండి వంటలు, నువ్వుల నూనెతో తయారయిన ఉరగాయ పచ్చళ్ళు తినడం వలన కూడా గర్భ విచ్చిత్తి జరుగుతుంది. పాతకాలపు ఇళ్ళలో మొదటి సారిగా సమర్త ఆడిన ఆడపిల్లలకు నువ్వులు , బెల్లం కలిపి ” చిమ్మిరి ” తయారు చేస్తారు. ఆ చిమ్మిరి ముద్ధలని పొరపాటుగా గర్భవతులు గనక సేవిస్తే వెంటనే గర్బం విచ్చిత్తి జరుగుతుంది.

వేడి చేసే పదార్దాలు తినోద్దు

రెండు, మూడు నెలలు గర్బవతులు గా ఉన్నప్పుడు అతిగా వేడిచేసే ఆవపిండి, ఆవకాయ, ఎక్కువుగా ఉప్పు , కాకరకాయ, కర్బూజా పండు, ఇంగువ, శోంటి, పిప్పిళ్ళు , మిరియాలు, నువ్వులు, బ్రాంది, విస్కీ, రమ్, ఎక్కువ ఎండు కారం, లవంగాలు, కర్పూరం, వస, వెల్లుల్లి, సునాముఖి మొదలయిన పదార్దాలు ఎక్కువుగా వాడటం వలన కూడా గర్భ విచ్చిన్నం జరుగును.

anjanadevi

అంజనాదేవి, యోగ టీచర్

Leave A Reply

Your email address will not be published.

Breaking