Header Top logo

ప్రజాస్వామ్యమా… నియంత పాలనా.. ?

ప్రజాస్వామ్యమా… నియంత పాలనా.. ?

– మల్లు రవి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు

ప్రాజెక్టు ను చూడడానికి వెళితే కూడా దౌర్జన్యం చేస్తారా అంటలూ ప్రశ్నించారు టీపీసీసీ సీనియర్ నాయకులు మల్లు రవి.

కాంగ్రెస్ కార్యకర్తను హత్య చేసేందుకు బిఆర్ఎస్ నాయకుల కుట్ర చేస్తున్నారన్నారు ఆయన.

కాంగ్రెస్ కార్యకర్త మెడపైన కాలు పెట్టి తొక్కుతున్న దృశ్యం రాష్ట్రంలో దుర్మార్గ పాలనకు పరాకాష్ట అన్నారు.

నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజక వర్గంలో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి గారు 7వ తేదీన మార్కండేయ ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లిన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలపై బిఆర్ఎస్ నాయకులు అధికార బలంతో దౌర్జన్యం చేసి దాడులు చేశారన్నారు.

మెడపైన కాలుతో తొక్కి హత్య చేసునందుకు కుట్ర చేశారన్నారు మల్లురవి.  ఈ విషయాన్ని  రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుజిల్లుతున్నామన్నారు.  వెంటనే దోషులపై చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతలు కాపాడాలని, బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఆయన.

Leave A Reply

Your email address will not be published.

Breaking