AP 39TV 05 జూన్ 2021:
అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని రాజీవ్ కాలనీలో అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి పనులను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తో కలసి అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించి పనులు ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ రహదారులు అభిరుద్దికి సూచికలు అన్నారు.రహదారులు అభిరుద్ది చెందితే భూముల విలువలు పెరిగి అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. మీ అందరి ఆశీస్సులతో మాకు పదవులు దక్కాయని మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభిరుద్ది,సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పనిచేసే ముఖ్యమంత్రి కి మాకు మరోమారు అవకాశం ఇవ్వాలని ఎంపీ సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.