కదిరి మునిసిపల్ పరిధిలోని యర్రగుంటపల్లి లేఆవుట్ నందు గృహనిర్మాణముల భూమిపూజ చేసిన – డా..పి.వి.సిద్దా రెడ్డి
AP 39TV 05 జూన్ 2021:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమములో భాగంగా కదిరి నియోజకవర్గం కదిరి మునిసిపల్ పరిధిలోని యర్రగుంటపల్లి లేఆవుట్ నందు గృహనిర్మాణముల కొరకు కదిరి శాసన సభ్యులు డా..పి.వి.సిద్దా రెడ్డి భూమిపూజ గావించి, గృహనిర్మాణములను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేదవాడు నివాసమునకు యోగ్యమైన ప్రదేశంను ఎన్నికచేసి పట్టాలను పంపిణీ చేసినదని అందులో భాగంగా ఈనాడు లభ్దిదారులు నిర్మాణములను ప్రారంభించి, గృహనిర్మాణమునకు ప్రభుత్వం సరఫరా చేయు సిమెంట్, ఇటుకలు తదితర వాటిని వినియోగించుకొని నిర్మాణములను చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమములో ఆర్.డి.ఓ వెంకటరెడ్డి , మునిసిపల్ కమీషనర్ ప్రమీల, హౌసింగ్ డి.ఇ. హూసేనప్ప, ఏ.ఇ. వాసుదేవరావ్, వర్క్ ఇన్ స్పేక్టర్లు రవింద్రానాయక్, భాణుప్రకాష్, కరెంట్ ఎ.ఇ లు, మునిసిపల్ కౌన్సిలర్లు రంగారెడ్డి, రాం ప్రసాద్, మహమ్మద్, ఎం.ఎన్. ఫయాజ్, ఆవులస్వామి, మురళి, ఆంజినేయులు, బొబ్బిలి రవి, కాంట్రాక్టర్ నాగరాజు, లబ్దిదారులు తదితర వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.