AP 39TV 23 ఫిబ్రవరి 2021:
గాండ్లపెంట మండలం లోని మల్ల మీద పల్లి పంచాయతీ సర్పంచ్ ప్రమాణస్వీకారోత్సవం లో భాగంగా ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందిన పీ కళావతి ప్రమాణ స్వీకారం పంచాయతీ సెక్రెటరీ నాగేంద్ర ఆధ్వర్యంలో చేయించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాల్మీకి స్కూల్ అధినేత పవన్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ సీపీ యువ నాయకులు పాల్గొన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి మల్ల మీద పల్లి పంచాయతీలో వైఎస్ఆర్సిపి సర్పంచ్ ఎన్నికైన కళావతి ని అభినందించారు. అదేవిధంగా వర్గాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నిక కాబడిన వార్డ్ మెంబర్ల చేత కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.మండల కన్వీనర్ పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అప్పి రెడ్డి, వెంకటరమణారెడ్డి ,మాజీ జెడ్పీటీసీ సభ్యులు భాస్కర్ రెడ్డి ,ఎం పి టి సి అద్దేప్ప నాయుడు మరియు పలువురు సర్పంచులు నాయకులు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.