Header Top logo

ఇంటిగ్రేటెడ్ కాలనీ లాగా పేరు మార్చడం జగనన్న ప్రభుత్వానికే దక్కింది…. ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ

గత ప్రభుత్వంలా ఎస్సీ కాలనీ అని పిలవకుండా ఇంటిగ్రేటెడ్ కాలనీ లాగా పేరు మార్చడం జగనన్న ప్రభుత్వానికే దక్కింది…. ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి .
ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా మన ఎమ్మెల్యే మన గ్రామానికి కార్యక్రమంలో ఇవాళ శింగనమల మండలం కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కాలనీలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ అన్ని శాఖల విభాగాలకు చెందిన ఉన్నత అధికారులు , అధికారులను తీసుకొని వచ్చామని ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా అధికారులకే అడగండి ‌ అని ప్రజలకు తెలియజేశారు.

ఎక్కువ శాతం మంది ప్రజలు ఇంటిపట్టాలు, పింఛన్లు, భూ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎందుకు రాలేదో పరిశీలించి వివరంగా ప్రజలకు తెలియజేశారు.
ఎవరు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని ప్రతి సంక్షేమ పథకం కులం మతం ప్రాంతం చూడకుండా ప్రజలకు అందజేయడమే మా ముందున్న మొదటి లక్ష్యమని అధికారులు, ఎమ్మెల్యే పద్మావతి ప్రజలకు హామీ ఇచ్చారు.

ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొనివచ్చి ఇంటి వద్దకే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని ప్రజలకు తెలియజేశారు. ఇంకా ఎవరైనా సంక్షేమ పథకాలు రాలేదు అంటే నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి మన ఎమ్మెల్యే మన గ్రామానికి ప్రోగ్రాం ద్వారా తెలుసుకొని అక్కడికక్కడే సమస్యలు తీర్చడానికి హామీ ఇచ్చారు

Leave A Reply

Your email address will not be published.

Breaking