Header Top logo

నగరపాలక సంస్థ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని నగరాన్ని అభివృద్ధి చేసుకొందాం

AP 39TV 28ఫిబ్రవరి 2021:

అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికలలో వై ఎస్ ఆర్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి అర్బన్ మాజీ శాసన సభ్యులు టీడీపీ ఇన్ ఛార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి  ఆధ్వర్యంలో అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని నగరాన్ని అభివృద్ధి చేసుకొందాం. జిల్లా టీడీపీ నాయకులు 27/2/2021 వ తేదీన అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవళ్ల మురళి  టీడీపీ జిల్లా నాయకులు రంగరాజు, నాగరాజు, టి ఎన్ టి యూ సి జిల్లా నాయకులు మేకల వెంకటేసు గౌడ్, నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు గౌస్ పీర్, టీడీపీ నాయకులు గోపాల్ గౌడ్, సున్నం శ్రీనివాసులు    ఆధ్వర్యంలో పత్రికా విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అధికార వై ఎస్ ఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి నిరోధక శక్తిగా మారిందని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తావుందని దౌర్జన్య కర పద్దతులలో అభ్యర్థులను భయపెట్టి ఏకగ్రీవాలు చేసుకోవాలనే దుర్మార్గమైన ఆలోచన్లలో అధికార వై ఎస్ ఆర్ పార్టీనాయకులు ఉండటం బాధాకరమని అదేవిదంగా, వై ఎస్ ఆర్ పార్టీకి ఓట్లేయకపోతే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని ఒకపక్క ఓటర్లను బెదిరించడం సిగ్గుచేటని వారు విమర్శించటం జరిగింది.  ఆ విదంగా ఓటర్లను బెదిరించటానికి సంక్షేమ పథకాలద్వారా ప్రజలకు ఇచ్చేసొమ్ము ఎవడబ్బ సొత్తుకాదని అదే విదంగా మాట్లాడటం వై ఎస్ ఆర్ పార్టీ నాయకులకు తగదని చెప్పటం జరిగింది. కావున ప్రజలు వై ఎస్ ఆర్ పార్టీ నాయకులు బెదిరి0చే బెదిరింపులకు  భయపడకుండా సైకిల్ గుర్తుకు ఓట్లేసి టీడీపీ అభ్యర్థులను గెలిపించుకొని నగరాభివృద్ధికి తోడ్పడాలని ప్రజకు విజ్ఞప్తి చేయటం జరిగింది. అదేవిదంగా 10 అంశాలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేటం జరిగింది.

1. అన్నా క్యాంటీన్లు పునరుద్దరిస్తామని

2 .పరిశుద్ధ కార్మికులకు 21 వేళా రూపాయలు జీతాలు పెంచటం

3 .బకాయిపడ్డ ఇళ్ల గుత్తలు రద్దు చేస్తామని ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటి గుత్తలులో 50 శాతం తగ్గిస్తామని ఇంకా తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పటం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking