AP 39TV 28ఫిబ్రవరి 2021:
అనంతపురం పట్టణం లోని టవర్ క్లాక్ నుండి VC NRI కళాశాల విద్యార్థులు డ్రగ్స్, మద్యపానం, ధూమపానం ని అరికట్టాలనే ముఖ్య ఉద్దేశంతో 3కె రన్ ను ఆడంబరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంటర్మీడియట్ బోర్డ్ RIO శ్రీ వెంకట రమణ నాయక్ , OSD శ్రీ చౌడేశ్వర రావు , కళాశాల ఛైర్మన్ శ్రీ విశ్వనాథ్ రెడ్డి , ఎం. డి. శ్రీ నటరాజ్ రెడ్డి హాజరయ్యారు…RIO శ్రీ వెంకటరమణ నాయక్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత చెడు మార్గాలను అనుసరిస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని అంధకారం లోకి నెట్టుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమాల ద్వారా యువతను మేల్కోలపడం అభినందకరం అని అన్నారు. OSD శ్రీ చౌడేశ్వర్ రావు మాట్లాడుతూ 3కె రన్ లాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల ఆరోగ్యం తో పాటు, సమాజానికి ఒక మంచి కార్యక్రమాన్ని తెలియజేయడం అనేది అత్యద్భుతం అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు ఇందు, ఈశ్వర్, CAO భీమేష్, అకౌంట్స్ ఆఫీసర్ వెంకటేష్, రెవెన్యూ ప్రిన్సిపాల్ మల్లికార్జున,అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.