- చావో రేవో తేల్చుకోవడానికి రైతులు సిద్దం..
- కేటీఆర్ స్పందించక పోవడానికి కారణం ఏమిటీ..?
- ఐదు గంటలుగా కలక్టర్ కోసం నిరిక్షీణ
- బీఆర్ ఎస్ స్పందన బీజేపీ కి మైలేజ్..
- రైతు ఉద్యమంలో కాంగ్రెస్ ప్రేక్షక పాత్ర
- రైతు ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ జన సమితి
- 6న కామారెడ్డి పట్టణ బంద్
రైతు దేశానికి వెన్నెమూక.. రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కడ బాగు పడలేదు.. ఈ పదాలు ఎక్కువగా ఉపయోగించేది మన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ గారే.. కానీ.. నెల రోజులుగా కామారెడ్డి మున్సిపల్ నూతన మాస్టర్ ప్లాన్ రగడ కొనసాగుతున్న ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రాక పోవడంతో రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నారు.
చిలికి చిలికి గాలి వానలా ఇప్పుడు కామారెడ్డి జిల్లా కేంద్రం ఉద్యమాలతో అట్టుడుకుతుంది. ప్రజాస్వామ్య పద్దతిలో ఆందోళన చేస్తున్న రైతాంగం డిమాండ్లను పట్టించుకోక పోవడం వల్లే ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. భూమిని నమ్ముకుని బ్రతుకుతున్న రైతులు చావో రేవో తేల్చుకోవడానికి ఉద్యమ బాట పట్టారు.
ప్రభుత్వం దిగి రాక పోవడంతోనే రైతు ఆత్మహత్య చేసుకోవడతో అన్నదాతలు ఆందోళనను మరింతా ఉదృతం చేస్తున్నారు. సమస్య పరిష్కారం అయ్యెంత వరకు ఆందోళన విరమించేది లేదంటున్నారు రైతులు.. రైతులపై పోలీసులు దాడులు చేయడంతో ఒక రైతు కాలు విరిగిందంటున్నారు.
కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
కామారెడ్డి కలెక్టరేట్ వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కలెక్టరేట్ వద్ద రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఆందోళనలో ఇద్దరు మహిళలు, రైతు సొమ్మసిల్లిపడిపోయారు. తోపులాటలో కానిస్టేబుల్‌కు స్వల్పగాయాలయ్యాయి. కామారెడ్డి కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు రైతుల యత్నించారు. ఈ క్రమంలో కలెక్టరేట్ ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లను రైతులు తొలగించారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడానికి ఐదు గంటల నుంచి నిరిక్షిస్తున్నప్పటికీ ఆపీస్ లో ఉన్న కలెక్టర్ బయటకు రాలేక పోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టరెట్ కు తాళం వేసిన పోలీసులు..
రైతులు చేస్తున్న ఆందోళన ఉదృతంగా మారడంతో కలెక్టరెట్ కు పోలీసులు తాళం వేశారు. అయినప్పటికీ రైతులు తాళాన్ని ద్వంసం చేసి లోనికి వెళ్లారు. కామారెడ్డి కలెక్టరెట్ ముందు ధర్నా చేసారు అన్నదాతలు. ఈ దర్నాలో బీజేపీ నాయకులు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొని ప్రభుత్వ తీరును నిలదీసారు.
రాళ్లు గుట్టలు ఉండే స్థలాన్ని పరిశ్రమల జోన్ గా..
ఎక్కడైతే వ్యవసాయం నడవదో.. రాళ్లు గుట్టలు ఉంటాయో అక్కడే పరిశ్రమలు పెడతామని ప్రభుత్వం ప్రకటనలు చేయాలని డిమాండ్ చేశారు దుబ్బాక్ ఎమ్మెల్చే రఘునందన్ రావు. శాంతియుతంగా రైతులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోక పోవడం బాధగా ఉందన్నారు. వ్యవసాయానికి పనికిరాని భూములనే పరిశ్రమలకు కేటాయించాలన్నారు ఆయన.
ఈ మాస్టర్ ప్లాన్ గొడవ ఏంటంటే..?
అసలు ఈ మాస్టర్ ప్లాన్ గొడవ ఏంటంటే..? రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపాలిటీ బృహత్ ప్రణాళికను దిల్లీకి చెందిన ఓ సంస్థతో ఇటీవల తయారు చేయించారు. కామారెడ్డి పట్టణంతో పాటు విలీన గ్రామాలైన అడ్లూర్, టెకిర్యాల్ , కాల్సిపూర్, దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వరపల్లిని కలుపుకుని 61.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా తయారు చేశారు. మొత్తం పట్టణాన్ని ఇండస్ట్రియల్, గ్రీన్, కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్లుగా విభజించి.. ఆ వివరాలను ఈ మధ్యే ప్రకటించారు.
- యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్