Header Top logo

Experiences Source ఇప్పుడు అనుభవాలు మూల పడ్డాయి (కవిత్వం)

Experiences Source
ఇప్పుడు అనుభవాలు మూల పడ్డాయి

మాయల మరాఠీ…!!

ఇప్పుడు అనుభవాలు
మూల పడ్డాయి…
జ్ఞాపకాల దొంతరలోనే
రాత్రీ పగలు కాలక్షేపం
ఎవరికైనా, ఎప్పుడైనా
ఇలాంటి ఓ పరిస్థితి
తప్పదేమో?

అనుభవాలు …
మనిషి జీవన సారమైతే
జ్ఞాపకాలు…
మనిషి బతుక్కు ఊతం!!

అప్పుడు…
అనుభవాల ఒడిలో
నిత్యం శ్రమించడం
ఇప్పుడు….
జ్ఞాపకాల పందిరి కింద
సేదతీరడం…!!

ఈ జీవితంకూడా …
చిత్రమైంది…
వయసులో వున్నపుడు
పరుగులు పెట్టిస్తుంది
వయసుడిగాక..
జ్ఞాపకాల తోటలో
కలలు కనమంటుంది.

జీవితమా…!
నువ్వో…
మాయల మరాఠీవా?

Experiences Source

అబ్దుల్ రాజాహుస్సేన్

ఎ.రజాహుస్సేన్, కవి
చిత్రం..అన్వర్

Leave A Reply

Your email address will not be published.

Breaking