పాఠాలు చెపుతూ
ప్రాణాలు విడిచిన ఉపాద్యాయుడు
ముమ్మడివరం, ఏప్రిల్ 21 : అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు ఉన్నత పాఠశాలలో ఉపాద్యాయుడు గుండెపోటు రావడంతో తరగతి గదిలో కుప్పకూలిపోయాడు. ప్రతిరోజూ మాదిరిగానే పాఠశాల తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆకొండి బంగారయ్య(57) విద్యార్థులకు పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు.
పాఠాలు చెపుతూనే ఒక్కసారిగా కుర్చీలో కుప్పకూలిపోయాడు. ఖంగుతిన్న విద్యార్థుల కేకలతో తోటి ఉపాధ్యాయులు తరగతి గదిలోకి వచ్చారు. వెంటనే 108కు సమాచారం అందించగా వారు పరీక్షించి ఉపాధ్యాయుడు మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు స్వగ్రామం అమలాపురం అప్పటివరకు తమతో మాట్లాడిన తోటి ఉపాధ్యాయుడు ఇకలేరని తెలియడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు.