Don’t stay with yourself now (Poetry)…నీవేప్పుడు నీతోనే ఉండిపోకు…
Don’t stay with yourself now …(Poetry)
నీవేప్పుడు నీతోనే ఉండిపోకు..
నీవెప్పుడు నీతోనే ఉండిపోకు
అపుడపుడు సమూహంలో కలిసిపో..
ఆకు చెట్టునుండి విడివడి వసంతంకోసం వెళ్లినట్లు..
మనుషులు కనబడగానే పరవశం తో పలుకరించు….
నీకున్న భుజకీర్తులు; ఆస్తులు; అంతస్తులు
సంపాదించుకున్న సకల సంపదలు
బంధాల్లో కురిసెప్రేమ జలకు సాటిరావు
నీ పలుకరింపులో నీవు పోగొట్టుకునేది ఏమిలేదు….పొందేది కూడ ఏమీలేదు
అనాదిగా నడయాడుతున్న మానవ అస్తిత్వం ముందు మొకరిల్లడం తప్ప;
ఏమి సాంధించావని విర్రవీగడం
ఒక్క ప్రేమగీతమైన రాశావ ఇంపుగా..
ప్రియురాలు సమ్మోహనపడేలా..
ఒక్క అక్షరమైన చెక్కవా తుపాకి తూటలా
ఉద్యమకారుడు మోసేలా
ఒక్క వరి గింజనైన పండించవా ఒళ్ళంతా స్వేదంతో
క్షుదర్థుల ఆకలి బాధ తీర్చేలా
ఒక్క పదమైన అచ్చంగా పలికావ నీది మాత్రమే సత్యంగా చెప్పగలిగేంత!!
జీవితాన్ని ఒక కాగితం చేసుకుని రాసుకున్నవా!స్వప్నసీమలో కురిసే భావోద్వేగాల చాలంచిత ఉద్విగ్నక్షణాల్ని!!
నీవేప్పుడు నీతోనే ఉండిపోకు
మేఘరాశి నుండి నీటి భిందువులు భూమిని ప్రేమగా ముద్దాడినట్లు..
పిచ్చుకలు నీటమునిగి జీవన సౌరభం జరుపుకున్నట్లు..
రాయంచలు రాతిపరుపుపై ఎగిరినట్లు… జీవితాన్ని స్వంతం చేసుకోలేవా!!
నువ్వెప్పుడు నీతోనే ఉండిపోకు
మట్టిరేణువుల మట్టిగానే మిగిలిపో!!
తుమ్మల దేవరావ్, రచయిత
సెల్: 8985742274