Header Top logo

Painter .. “Raghuram Bairu” *ఈ చిత్రకారుడు పక్కా….హైదరాబాదీ..!!

Painter .. “Raghuram Bairu”

*ఈ చిత్రకారుడు పక్కా….హైదరాబాదీ..!!

రఘురామ్ బైరు చిత్రకారుడు 1

*గ్రాఫిక్ ప్రింట్ మేకింగ్ కళలో ఆరితేరిన…. హైదరాబాద్ చిత్రకారుడు..”రఘురామ్ బైరు”,(Graffic Print Making Artist Raghuram Bairu from Hyderabad.Telangana, India.)ఆగస్టు 18,1949 లో జన్మించారు.చిన్నప్పటి నుండే చిత్రాలు గీసేవారు.తొమ్మిదో తరగతిలో చదివే సమయంలో స్కూల్లో నిర్వహించిన డ్రాయింగ్ పోటీల్లో రఘురామ్ కు రెండో బహుమతివచ్చింది.అప్పటి కలెక్టర్ చేతుల మీదుగా బహుమతిని అందుకొని తెగ సంబర పడ్డాడు.

అయితే పిల్లాడు ఇలా చదువుమానేసి బొమ్మలు గీసుకోవడంలో పడ్డాడని తల్లిదండ్రులు బాధపడ్డారు.ఆ తర్వాత డ్రాయింగ్ లో లోయర్,హయ్యర్  పాసయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ లో  బిఎ చదివారు.కర్నాటక గుల్బర్గా యూనివర్సిటీ లో ఆర్ట్స్ లో  డిప్లొమా చేశారు. జనాభాగణ (సెన్సెస్ ) శాఖలో ఆర్టిస్ట్ గా ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని భోలక్ పూర్ లోవిశ్రాంత జీవనం గడుపుతున్నారు..ఏడుపులు వయసులో కూడా ఆయన ఉత్సాహంగా చిత్రాలు వేస్తుండటం…. విశేషం.రఘురామ్ బైరు చిత్రకారుడు

*గ్రాఫిక్ ఆర్ట్..!!

ఓ వైపు ఉద్యోగం,ఇంకో వైపుచిత్రలేఖనం ప్రాక్టీసు జరుగుతుండేది. 1980 లో లలిత కళా అకాడమీ, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రాఫిక్ స్టుడియో ప్రారంభమైంది. రఘురామ్ అందులో… సభ్యుడిగాచేరి నలుపు..తెలుపు గ్రాఫిక్ ఆర్ట్ కు శ్రీకారంచుట్టారు.గ్రాఫిక్ ప్రింటింగ్ మేకింగ్ కళను మొదలు పెట్టారు.తన భావం వ్యక్తీకరణకు ఈ కళ సూటైంది.ఇక అంతే..వెనుదిరిగి చూసుకోలేదు.1995 లోభోపాల్ బినాలె షోలో పాల్గొన్నారు.1996 లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ గోల్డ్ మెడల్ వచ్చింది.1997 లో జాతీయ అవార్డు అందుకున్నరు.గ్రాఫిక్ ఆర్ట్స్ గురించి ముద్రించిన పుస్తకం లో రఘురామ్ గురించి ఓ ఆర్టికల్ వుంది. 2013 లో హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ వారి కళా రత్న ప్రతిభా  పురస్కారం లభించింది. 2015 లో లండన్ లో జరిగిన గ్రూప్ షోలో పాల్గొన్నారు.2017 లో జపాన్ వారు రెసిడెన్సీకి పిలిచారు.అక్కడ జరిగిన గ్రూప్ షోలలో పాల్గొన్నారు.

*నలుపు..తెలుపు చిత్రాలు!!

*పల్లెజీవితంలోని కష్టసుఖాలరఘురామ్ బైరు చిత్రకారుడు 2కు అద్దంపడుతూ నలుపు తెలుపు చిత్రాలను ఆయన ఎన్నో వేశారు.ఆయన వేసిన ప్రతీ చిత్రం తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు ఆనవాలు. (Raghuram (born 1949) is an Indian painter.His depictions are simple, rural life and woman in their daily life.He is mostly inspired by the tranquillity of rural Telangana.) పుట్టిపెరిగింది హైదరాబాదులో….ఆయన చిన్నతనంలో హైదరాబాదు చుట్టూ అన్నీ పల్లెలే.ఆ పల్లెవాతావరణాన్ని,జనజీవనాన్ని చూస్తూ…..పెరిగిన రఘురామ్ తన చిత్రాల్లో వాటిని… అచ్చుగుద్దారు.చిన్నతనంలో సిద్ధిపేట, వరంగల్, కరీంనగర్తిరిగి,అక్కడి ప్రాంతాన్ని,ప్రజల్ని చూసి స్కెచెస్ చేసేవారు.అప్పుడు ఎక్కడ చూసినా పేదరికం, మాసిన ఇళ్ళు,సున్నంరాలిన గోడలు ఒకేలా వుండేవట.  దృశ్యాల్ని చిత్రీకరిస్తూఅప్పుడు కొన్నివేల స్కెచెస్ వేశారు. అవే నేటికీ తనకళ్ళలోకదలాడుతున్నాయట.నాటి జనం. పక్షులు, కోళ్ళు, మేకలతో మమేకమైన జీవన విధానం రఘురామ్ చిత్రాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమంటే…..రఘురామ్ చిత్రాల్లో మనుషులు మూగజీవులుగా,మూగ జీవాలు చైతన్యానికి ప్రతీకలుగా కానవస్తారు..!ఆయన వేసిన చిత్రాల్లో ఎన్నో ఆణిముత్యాలున్నాయి…Woman with a Goat, Telangana Woman with Parrot, Knocking, Movement, Lady with Hen, తదితర చిత్రాలు రఘురామ్ చిత్రాలకు ఆనవాళ్ళుగా గురించినిలుస్తాయి.

*గ్రాఫిక్ ప్రింట్ మేకింగ్ కళలో ఆరితేరిన…. హైదరాబాద్ చిత్రకారుడు..”రఘురామ్ బైరు”,(Graffic Print Making Artist Raghuram Bairu) కు అభినందనలు…!!

Abdul Rajahussen Writer..

*ఎ.రజాహుస్సేన్, రచయిత, హైదరాబాద్

Leave A Reply

Your email address will not be published.

Breaking