Header Top logo

Do not rely on superhumans మానవాతీతులపైన ఆధార పడకండి..

Do not rely on superhumans Dr.BR Ambedkar

మానవాతీతులపైన ఆధార పడకండి.

  • డా.బి.ఆర్.అంబేడ్కర్

బాబాసాహెబ్ అంబేడ్కర్ దేశ ప్రజలకు, ప్రపంచ మానవాళికి దేవుడు కేంద్రంగా లేని ఇండియా లోని పుట్టిన ఇండియాలోని మూల నివాసి ప్రజలు ఒకప్పుడు ఆచరించిన బౌద్ధ మతాన్ని తీసుకోమని, దాస్య విముక్తి కోసం మతమార్పిడి తప్పనిసరిగా చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయం ఎస్సీలు అసలు పట్టించుకోవడం లేదు. అలాగే ఎస్సీ లు ఇతర ఎస్టీ, బిసీ, మైనారిటీలతో ఏకం అయి రాజ్యాధికారం సాధించుకుంటే తప్ప ఈ దేశంలో పీడితులకు విముక్తి లభించదు అనేది చాలా సుస్పష్టం.

ambedkar

జోకోట్టే మతం ఉండద్దు..

అంబేడ్కర్ జీవితం గురించి చదవని ఎస్సీ యువత, ఎస్సీ ప్రజలు ఎక్కడో పుట్టిన ఏసుక్రీస్తు గురించి, బైబిల్ గురించి వాక్యాలు కూడా అక్షరం తప్పు లేకుండా చెప్పడం హాస్యాస్పదం. మతం మనుషులకు తప్పనిసరిగా ఉండాలి. అయితే అది ఎలాంటి మతం ఉండాలి? మనల్ని జోకోట్టేదిగా, నిద్రమత్తులో ఉంచేదిగా మతం ఉండరాదు. అంబేడ్కర్ అందుకే దేవుడు లేని ,స్వర్గ లోకం ,పరలోకం ప్రస్తావన లేని శాస్త్రీయమైన బౌద్ధ మతాన్ని స్వీకరించి లక్షలాది మందితో మత మార్పిడి ఉద్యమం చేపట్టి భవిషత్తులో ఇండియన్ ప్రజలకు బౌద్ధం ఆవశ్యకతను చూపెట్టారు.

దేవుడు మీద ఆధార పడితే..

దేవుడు, మతం మీద ఆధారపడటం వలనే పర దేశీయులు మన దేశాన్ని ఆక్రమించారని, అందు వలనే మనం శత్రువులకు లొంగి పోయామని డా.అంబేడ్కర్ చెప్పారు.ఏదైనా కష్టం వస్తే ,విపత్తు వస్తే దేవుడు దిగివచ్చి మనల్ని కాపాడతాడని నమ్మడం వలనే మనలో ఐక్యత ఉండటం లేదు.క్రైస్తవ మతం కూడా అలాంటిదే బోధిస్తుంది.ఈ లోకంలో జరుగుతున్న వాటి గురించి కాకుండా చనిపోయాక పరలోకం లోకి వెళ్ళడం కోసం ఎంతసేపూ చర్చ్ లో చెప్పే విషయాలు నమ్మడం, బైబిల్ లో ఉన్నవే నమ్మడం మన ప్రజలు చేస్తున్నారు.

ambedkar

మతం మనిషిని ఆలోచింప చేయదు

వాస్తవాలు పట్టించుకోవడం లేదు. ఒక రకమైన భ్రమలో బతికేస్తున్నారు. మతం మనిషిని ఆలోచింప చేయాలి కానీ క్రైస్తవం ఏం చెబుతుంది? హిందూ మతం మాదిరిగానే స్వర్గం లోకం అంటూ వాళ్ళు చెప్పినట్లే పర లోకం కోసం మన ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఎస్సీ ప్రజల జీవన విధానం గమనించండి. చర్చ్ , బైబిల్ చదవడం లేదా బైబిల్ లో చెప్పినవే నిజమని నమ్మడం, ప్రార్థనలు చేసుకోవడం తప్పితే ఇంకేమీ పట్టించు కోరు. దేవుడు, బైబిల్ ఇదే. ఇంక మరొకటి వీళ్ళకి అవసరం లేదు. దీని కోసమా అంబేడ్కర్ ఆనాడు మనకోసం తన భార్య పిల్లలను, తన జీవితాన్ని త్యాగం చేసింది. ఒక పక్క అంబేడ్కర్ మా దేవుడు అంటూనే అంబేడ్కర్ చెప్పినవి ఒక్కటి కూడా ఆచరించే ప్రయత్నం ఎస్సీ లతో పాటు ఇతరులలో కనబడటం లేదు.

మీ బానిసత్వాన్ని మీరే నిర్మూలించుకోవాలి

అంబేడ్కర్ చాలా స్పష్టంగా చెప్పారు “మీ బానిసత్వాన్ని మీరే నిర్మూలించుకోవాలి. దాని నిర్మూలనకి దేవుడి పైనో, మానవాతీతుడి పైనో ఆధారపడకండి .” ఎస్సీ లు మరి ఇది నిజంగా పాటిస్తున్నారా?  పొద్దున్న లేస్తే హల్లోలూయా, శ్రీరామ్, అల్లాహా తప్ప మరొకటి అవసరం లేదు. మీ విముక్తి రాజకీయ శక్తిలో ఉంది కానీ, మీరు తీర్థ యాత్రలు చేయటం వల్లనో, ఉపవాసాలు ఉండటం వల్లనో రాదని అంబేడ్కర్ చెప్పారు. మనవాళ్ళు ఏం చేస్తున్నారు? నిజంగా మతాలే గొప్పవైతే నిజంగా దేవుడే ఉంటే ఒక తమ మతస్థులతో ఎందుకు కలిసి ఉండరు. మతం మారి ఇతర మతంలోకి వెళ్లిన వాళ్ళు ఎందుకు తిరిగి కుల వ్యవస్థ ప్రకారం ఎవడి కులం వాడితో వాళ్ళ కులం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు.

మత గ్రంథాలు మిమ్మల్ని..

“మత గ్రంథాలపై భక్తి మిమ్మల్ని బానిసత్వం, పేదరికం, న్యూనతా భావాల నుంచి విముక్తులను చేయదు. మీ పూర్వీకులు తర తరాల నుండి ఇదే చేస్తూ వస్తున్నారు. కానీ,ఎటువంటి ఉపశమనం కాని, ఏ మాత్రం చిన్న తేడా కానీ మీ దుర్భర జీవితాలలో ఏ విధంగానూ మార్పు రాలేదు. మీ పూర్వీకులు లాగానే మీరు కూడా చింకి దుస్తులు ధరిస్తున్నారు. వారి లాగానే మీరు విసిరేసిన మెతుకులపై జీవిస్తున్నారు. వారి లాగానే మురికి వాడలలో ఇరుకు కొంపలలో మీరు మగ్గి పోతున్నారు. వారి లాగానే రోగాలకు బలి అవుతూ, పిట్టలు రాలినట్టు రాలుతున్నారు. మీ ఉపవాసాలు,కటోరమైన మత సంస్కారాలు మిమ్మల్ని కటిక దారిద్ర్యం నుంచి రక్షించ లేవు.” పై వాక్యాలు అర్థం చేసుకుని మీ పేటలలో సామాన్య జనాలకు చెప్పండి.

అంబేడ్కర్ తత్వం ముఖ్యం

మతం గురించి.. మన జాతి మనం బహుజనులం. కాబట్టి మతం కాదు మనకు అంబేడ్కర్ తత్వం ముఖ్యం. అంబేడ్కర్ బోధించిన బౌద్ధ మతం ముఖ్యం. అంబేడ్కర్ బోధించిన బౌద్ధం లోనే మనకు సంతోషం ఉంది, రాజ్యాధికారం సాధించు కోవడం లోనే మనకు విముక్తి ఉంది.

  • నాగసేన బోధి, రచయిత

Leave A Reply

Your email address will not be published.

Breaking