AP 39TV 26మార్చ్ 2021:
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలందరు సహకరించాలని అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. నియోజకవర్గం కార్యాలయంలో శుక్రవారం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని ఆశా ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో మాజీ ఎమ్మెల్యే సహా నియోజకవర్గ కార్యాలయ సిబ్బంది మరో 40 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకున్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలరన్నారు. గత సంవత్సరం కరోనాతో అనేకమంది చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. అలాంటి పరిస్థితి మరోసారి తలెత్తకుండా ప్రజలందరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విధంగా ప్రతిఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, మాస్క్ ధరించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని, వైద్యుల పర్యవేక్షణలో కరోనా వ్యాక్సిన్ వేయించు కోవాలని పిలుపునిచ్చారు.