Header Top logo

జర్నలిస్టులు అందరికీ కరోనా వ్యాక్సిన్.

AP 39TV 19 ఏప్రిల్ 2021:

రాష్ట్రం లోని జర్నలిస్టులందరికి కరోనా వ్యాక్షన్ వేయించాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి అవసరమైన చర్యలు తీసుకోవటం జరుగుతోందని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమ వారం ఏపీయుడబ్ల్యూ జే, ఐజేయూ నేతలు ఆయనను కలసి జర్నలిస్టుల సమస్యల పై చర్చించారు. ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయుడబ్ల్యూజే అధ్యక్షుడు ఐ. వి. సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ తదితరులు కమిషనర్ తో సమస్యలు వివరిస్తూ జర్నలిస్టులను కోవిడ్ వారియర్స్ గా గుర్తించి ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి జర్నలిస్ట్, నాన్ జర్నలిస్ట్ కు తక్షణం వ్యాక్షిన్ వేసేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు డోసులు వేయాలని కోరారు. సానుకూలంగా స్పంధించిన కమిషనర్ వెంటనే పరిస్థితి సీఎం దృష్టికి తీసుకుపోయి అవసరమైన చర్యలు తీసుకోవటం జరిగుతుందని హామీ ఇచ్చారు. కోవిడ్ తో మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబానికి రూ 5 లక్షల ఆర్థిక సహాయం ఇంకా అందకపోవటం పై చర్చించారు. యూనియన్ ఇచ్చిన 48 మంది మృతుల లో 25 మందికి సంబంధించి అన్ని సర్టిఫికేట్స్ ఇచ్చారని వారి కుటుంబాలకు డబ్బులు మంజూరు అయ్యాయని , వెంటనే వారి కుటుంబాలకు అందే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతోందని హామీ ఇచ్చారు. మిగిలిన మృతులకు సంబంధించి యూనియన్ నాయకులు సూచించిన విధంగా కొన్ని నిబంధనలు సడలించే విషయం ను పరిశీలిస్తామని తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ సోకిన ప్రతి జర్నలిస్ట్ కు రూ 20 వేలు ఇవ్వాలని కోరారు. అక్రిడేషన్స్ విషయం పై ఈ నెల 23 వ తేదీ కోర్టు నిర్ణయం వెలుబడే అవకాశం ఉందని, కోర్టు నిర్ణయం ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవటం జరుగుతోందని తెలిపారు. పలువురు జర్నలిస్టులకు సంబంధించి యూనియన్ నాయకులు చేసిన విజ్ఞప్తి మేరకు వారికి సంక్షేమ నిధి నుండి ఆర్థిక సహాయం మంజూరు చేశారు. కమిషనర్ ను కలిసిన వారిలో ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ. వి. సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ పలువురు జర్నలిస్ట్ నాయకులు ఉన్నారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking