Header Top logo

నాందేడ్ లో సీఎం కేసీఆర్ సభ సక్సెస్..

 నాందేడ్ లో సీఎం కేసీఆర్ సభ

జనం సమీకరణలో ప్రజాప్రతినిధులు సక్సెస్

జనంను ఆకర్శించుకోవడానికి కేసీఆర్ హిందీలో  ప్రసంగం..

రైతుల సమస్యాలపైనే కేసీఆర్ గురి..

మహారాష్ట్రలో జీవనదులున్నా.. నీరు లేదు.. కరెంట్ లేదు..

రైతు రాజ్యం తెద్దామా..?  అంటూ జనంతో నినాదాలు..

మేకిన్‌ ఇండియా.. జోకిన్‌ ఇండిగాయా మారింది. బీజేపీపై కేసీఆర్‌ అటాక్‌..

తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు స్పీచ్ అదిరింది పో.. భారత రాష్ట్ర సమితి (బీఆర్ ఎస్) నాందేడ్ లో ఏర్పాటు చేసిన బహిరంగా సభ సక్సెస్ అయ్యింది. జనానికి డబ్బులు ఇచ్చి రప్పించారో.. కేసీఆర్ మీద ప్రేమతో వచ్చారో కాని.. జనంతో ఆ సభా ప్రాంగణం నిండి పోయింది. ఆ జనం నాడిని గుర్తించిన కేసీఆర్ హిందీలో తమదైన శైళిలో స్పీచ్ ఇచ్చి వారి హృదయాలను కొల్ల గొట్టారు.

మేకిన్‌ ఇండియా.. జోకిన్‌ ఇండిగాయా మారింది.

బీజేపీపై కేసీఆర్‌ అటాక్‌ చేశారు. దేశ రాజకీయాలలో తమదైన ముద్ర వేసుకోవడానికి ఈ వేదిక ద్వారా ఇచ్చిన సందేశంపై జాతీయ మీడియా దృష్టి పెడుతుందని భావించిన కేసీఆర్ తెలంగాణలో తాను చేస్తున్న సంక్షేమ పథకాలను చూపుతునే దేశంలో తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తానో చెప్పడం విశేషం.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ – ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ సాగిన ఉపన్యాసంలోొ జనంతో ఔనా.. కాదా అంటూ నినాదాలు చేయించడంతో తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసింది. తెలంగాణ సెంటిమెంట్ తో ఆ ఉద్యమం అందరిది అనే ఫీలింగ్ తీసుకు రావడంలో కేసీఆర్ సక్సెస్ అయినట్లుగా నాందేడ్ లో జరిగిన బహిరంగ సభలో కూడా విమర్శల కంటే ఎక్కువ రైతు సమస్యలపై ప్రసంగించారు.

భారత్ రాష్ట్ర సమితీ ఏర్పాటు చేసిన తరువాత మొదటి సారి తెలంగాణ రాష్ట్రం పక్కనే ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ లో సభ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవడానికి ఆ ప్రాంతంలో తెలుగోళ్ల సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా కారణం కావచ్చు.

మహారాష్ట్ర సమస్యలతో పాటు దేశంలో ప్రధానులు ఎలా అన్యాయం చేశారో చెబుతునే గులాభి జెండా –  రైతు సర్కార్ తెద్దామా..? అంటూ నినాదాలు చేయించారు. దళిత స్కీంలో పది లక్షలు ఉచితంగా ఇస్తున్నామని, తాము అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా దళితులకు అందిస్తామన్నారు కేసీఆర్.

తెలంగాణలో వ్యవసాయం సాగుకోసం రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్నమని గుర్తు చేసారు. నేను చెప్పె ముచ్చట్లను పల్లెలకు తీసుకెళ్లి జనంతోని.. స్నేహితులతో చర్చించండి. 75 ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో తాగు నీరు లేదు.. కరెంట్ సమస్య ఉంది.. వనరులున్నా ఎందుకు పాలకులు నిర్లక్షం చేశారో ఆలోచన చేయాలని పిలుపు ఇచ్చారు.

మహారాష్ట్ర నుంచి భారత రాష్ట్ర సమితీ విస్తరిస్తోంది.. మీరు ఆశీర్వాదించండి. ప్రతి పల్లెకు బీఆర్ ఎస్ వస్తోంది అంటూ తనదైన శైళిలో ఉపన్యాసం ముగించారు. ఈ సభలో బాల్క సుమన్ అట్రాక్షన్ గా నిలిసారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం  నాతో పాటు పోరాటం  చేసిన బాల్క సుమన్ ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిసారని పరిచయం చేయడం కొస మెరుపు.

సభ సక్సెస్ తో ఊపీరి పీల్చుకున్న నాయకులు..

నాందేడ్ లో జరిగే బహిరంగ సభను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా సభావేదికతో పాటు జనంను సమీకరించడంలో సక్సెస్ అయ్యారు. సభాప్రాంగణమంతా జనంతో నిండి పోవడంతో కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ ఎస్ ను దేశ వ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఇదే ఉత్సహంతో ముందుకు తీసుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్లు అతని స్పీచ్ లో కనిపించింది.

  • యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్ 9492225111

 

Leave A Reply

Your email address will not be published.

Breaking