ఎమ్మెల్యేల ఎరకేసులో సీఎం కేసీఆర్‌ను సీబీఐ ప్రశ్నించే ఛాన్స్
: మాజీ జేడీ లక్ష్మీనారాయణ
తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిబీఐ ఎంట్రీతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
తాజా పరిణామాలతో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ కేసులో చిక్కులను ఎదుర్కోవలసి వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని సి.బి.ఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ కూడా స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..
వీడియోతో కేసీఆర్ ఎటాక్
మునుగోడు ఉప ఎన్నికకు ముందు పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫాం హౌస్ లో బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కోసం నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజీ స్వామీలు రంగంలోకి దిగి, ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్ల చొప్పున డీల్ మాట్లాడారని, ఆ డీల్ భగ్నం చేసినట్లుగా తెలంగాణ పోలీసులు తెలిపారు.
ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరి డీల్ కు సంబంధించిన వీడియోలను చూపించి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
బిజెపి లోని కొందరు అగ్రనేతల పై సంచలన ఆరోపణలు చేశారు.
ఇక ఆ తర్వాత సిట్ ను ఏర్పాటు చేసి బిజెపి నేతలను ఈ కేసులో ఇరికించి, ఉచ్చు బిగించాలని సీఎం కేసీఆర్ శతవిధాలా ప్రయత్నం చేశారు.
ఎమ్మెల్యేల ఎరకేసులో కేసీఆర్ ను విచారించే ఛాన్స్ ఉందన్న సీబీఐ మాజీ జేడీ లక్షీనారాయణ
అయితే ఊహించని విధంగా ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు సిబిఐ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు వ్యవహారం మొత్తం రివర్స్ అయింది.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో చోటు చేసుకున్న ఎమ్మెల్యేల ఎర కేసులో తాజా పరిణామాలతో సీఎం కేసీఆర్ ను కూడా సిబిఐ విచారించే అవకాశం లేకపోలేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, సీబీఐకి అనుమానం ఉంటే కెసిఆర్ ని కూడా ప్రశ్నించే అవకాశం లేకపోలేదని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉందంటున్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చట్టం ముందు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా ఒకటే అని పేర్కొన్నారు ఆయన.
అవసరమైతే కెేసిఆర్ కు సైతం నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉందన్నారు. చట్టానికి లోబడి ఎవరైనా విచారణకు రావాల్సిందేనని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణ హైకోర్టు కూడా ఈ కేసుకు సంబంధించిన కీలక తీర్పులో సీఎం కేసీఆర్ కు ఆధారాలు ఎక్కడినుంచి వచ్చాయి అని ప్రశ్నించింది.
కేసుకు సంబంధించిన ఆధారాలను, వీడియోలను సీఎంకు ఎవరిచ్చారో చెప్పాలని కోర్టు సిట్ అధికారులను ప్రశ్నించింది.
సీబీఐ ఎంట్రీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టుతీర్పుతో చర్చ
సిట్ దర్యాప్తు సరిగాలేదని పేర్కొన్న న్యాయస్థానం ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి 45 కారణాలను చెప్పింది. ఇక ఈ నేపథ్యంలోనే సిబిఐ ఎంట్రీ ఇస్తే సీఎం కేసీఆర్ సైతం విచారించే అవకాశం ఉందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇక ఆ చర్చకు బలం ఇస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఈ కేసులో కెసిఆర్ ను విచారించే అవకాశం లేకపోలేదని తేల్చి చెప్పారు..