బొందలవాడ రోడ్డును అధికారంలోకి రాగానే అతి తక్కువ కాలంలోనే పూర్తి చేసిన -ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి
AP 39TV 15 ఫిబ్రవరి 2021:
బొందలవాడ సర్పంచ్ అభ్యర్థి కోనంకి పద్మావతి ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి మరియు అనంతపురం ఎన్నికల పార్లమెంట్ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. కోనంకి పద్మావతి కత్తెర గుర్తుకు ఓటు వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా దుర్భరమైన పరిస్థితిలో ఉన్న నార్పల – బొందలవాడ రోడ్డుని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎంతో నాణ్యతతో అతి తక్కువ కాలంలోనే పూర్తి చేయించడం జరిగింది అని ప్రజలకు తెలిపారు. ఎవరెన్ని ఆటంకాలు,అడ్డంకులు సృష్టించినా ఎవరికీ భయపడకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని, మీ గ్రామంలో గతం నుంచి కూడా ఏ ఎన్నికలు జరిగిన ప్రజలను బెదిరించి భయాందోళనలకు గురి చేయడం జరుగుతూ ఉందని ఇప్పుడు అలా కాకుండా మీ సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడదామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.