AP 39TV 15 ఫిబ్రవరి 2021:
అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని రూరల్ గ్రామ పంచాయతీ లో ఎన్నికల ప్రచారం వూపందుకుంది.సర్పంచ్ అభ్యర్థి మీనుగ రాజేశ్వరి ని బలపరుస్తూ టీడీపీ సీనియర్ నాయకుడు లింగారెడ్డి పలువురు నాయకులు, కార్యకర్తలు పంచాయతీ పరిధిలోని 8,9 వార్డు,భైరవనగర్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీధివీధి తిరుగుతూ మీనుగ రాజేశ్వరి కి కేటాయించిన బుట్ట గుర్తుకు ఓటువేసి వేయించి గెలిపించాలని కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మీనుగ రాజేశ్వరి మాట్లాడుతూ 20 నెలలుగా రూరల్ పంచాయతీ లో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుబడ్డాయని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. టీడీపీ, సీపీఐ ప్రోద్బలంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని తన గెలుపుకు ప్రజల్లో మంచి స్పందన వస్తోందన్నారు.రూరల్ గ్రామ పంచాయితీని గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.టీడీపీ సీనియర్ నాయకుడు లింగారెడ్డి మాట్లాడుతూ మీనుగ రాజేశ్వరి ని సర్పంచ్ గా గెలిపించుకునేందుకు టీడీపీ శ్రేణులు అన్నివిధాలా సహకారం అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పంచాయతీ ప్రజల్లో గుర్తుండిపోయిందని టీడీపీ బలపరుస్తున్న మీనుగ రాజేశ్వరి ని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు.రాజేశ్వరి తోపాటు తమ పార్టీ బలపరుస్తున్న వార్డుసభ్యులందరు గెలుపొందడం ఖాయమన్నారు.ప్రస్తుత ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా గల్లంతేనని లింగారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు, పంచాయతీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.