Header Top logo

బండి సంజయ్ నోరు జాగ్రత్త : మంత్రి

బండి సంజయ్ నోరు జాగ్రత్త..

నోటికొచ్చినట్లు మాట్లాడితే తగిన శాస్తి తప్పదు

నీ రాజకీయ మైలేజి కోసం రైతులను రెచ్చ గొట్టకు

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రైతుల అభీస్టం మేరకే ఉంటుంది

రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుంది కేసిఆర్ ప్రభుత్వం

రైతుల బాగు గురించి నీతో చెప్పించుకోవాల్సిన గత్యంతరం మాకు పట్టలేదు

ప్రశ్నించిన రైతులను తొక్కించి చంపిన చరిత్ర మీది..ఎరువుల ధరలు పెంచుతూ..అన్ని విధాలా నిండా ముంచుతూ..పైశాచిక ఆనందం పొందుతున్న నీ కేంద్ర బీజేపీ ప్రభుత్వంకు చెప్పు నీ నీతులు

– బండి సంజయ్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్

హైదరాబాద్:

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రైతుల అభీష్టం మేరకే ఉంటుందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు రైతులను అనవసరంగా రెచ్చ గొడుతున్నారని మండిపడ్డారు.

బండి సంజయ్ కామారెడ్డి లో నోటికొచ్చినట్లు మాట్లాతున్నడని “నోరు జాగ్రత్త బండి సంజయ్” అని మంత్రి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల కోసం ఏమీ చేయాలో నీతో చెప్పించు కోవాల్సిన గత్యంతరం మాకు పట్టలేదని అన్నారు.

దేశం మొత్తంలో అత్యంత గొప్పగా గౌరవింప బడుతున్న రైతు తెలంగాణ రైతు అని మంత్రి వెల్లడించారు.

రైతులకు ఏమీ చేయాలో తమకు తెలుసని కేంద్రంలో ఉన్న నీ బీజేపీ ప్రభుత్వానికి నీ సలహాలు ఇవ్వు అని చురకులు అంటించారు.

రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం మద్దతు ధర ఇవ్వక పోగా.. ఎరువుల ధరలు మూడు రెట్లు పెంచి రైతుల నడ్డి విరుస్తోందని,ప్రశ్నించిన రైతులను వాహనాలతో తొక్కించి చంపిన చరిత్ర బీజేపీ దని మండిపడ్డారు.

కేవలం రాజకీయ లబ్దికోసమే తన హైకమాండ్ ఆదేశాల మేరకే కామారెడ్డి లో బండి సంజయ్ డ్రామాకు తెరలేపాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్ కి చేతనైతే కేంద్రంతో మాట్లాడి సిలిండర్ ధర తగ్గించు..వ్యవసాయ రంగం మీద వేసే పన్నులు తగ్గించు..

 

Leave A Reply

Your email address will not be published.

Breaking