AP 39TV 19ఏప్రిల్ 2021:
దిల్లీ: కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో పశ్చిమ్‌బెంగాల్‌లోని అన్ని బహిరంగ సమావేశాలను రద్దు చేసుకున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. మిగతా పార్టీల నేతలు కూడా సమావేశాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్టు చేశారు.‘‘ కరోనా విస్తృతి నేపథ్యంలో పశ్చిమ్‌బెంగాల్‌లోని అన్ని బహిరంగ సమావేశాలను రద్దు చేసుకున్నా. తాజా పరిస్థితుల గురించి రాజకీయ పార్టీల నేతలందరూ ఆలోచించాలని సూచిస్తున్నా. బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల జరిగే నష్ట తీవ్రతను అంచనా వేయాలని కోరుతున్నా’’అంటూ ఆయన ట్వీట్ చేశారు.