Header Top logo

జగనన్న విద్యా దీవెన మొదటి విడత కార్యక్రమం

AP 39TV 19ఏప్రిల్ 2021:

క్యాంప్‌ కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా జమ చేయనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.జగనన్న విద్యా దీవెన.పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశచరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా అర్హత ఉన్న ప్రతీ విద్యార్ధికి, సకాలంలో ఏ బకాయిలు లేకుండా నాలుగు ధఫాల్లో పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌.ఇక ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికంలోనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లో జమ.2020–2021 విద్యా సంవత్సరం మొదటి విడతగా నేడు 10,88,439 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా రూ. 671.45 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం.జగనన్న విద్యా దీవెన మొదటి విడత – ఏప్రిల్‌ 19, రెండో విడత జులై, మూడో విడత డిసెంబర్, నాలుగో విడత ఫిబ్రవరి, 2022లో విడుదల చేయనున్న ప్రభుత్వం.జగనన్న వసతి దీవెన (రెండు విడతల్లో భోజనం, వసతి, రవాణా సౌకర్యాలకు ఏటా రూ. 20,000 వరకు లబ్ది) మొదటి విడత – ఏప్రిల్‌ 28, రెండో విడత – డిసెంబర్‌.గత ప్రభుత్వం రూ. 1,880 కోట్లు బకాయిలు పెడితే శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ బకాయిలు తీర్చడంతో పాటు రూ. 4,207.85 కోట్ల లబ్ది విద్యార్ధులకు చేకూర్చింది.ఈ ఏడాది మొదటి విడతగా రూ. 671.45 కోట్లు నేడు చెల్లించడం ద్వారా 10,88,439 మంది విద్యార్ధులకు లబ్ది కలుగుతుంది.ఇప్పటివరకు మొత్తం లబ్ది రూ. 4,879.30 కోట్లు.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking