As far as I know about Periyar పెరియార్ గురించి నాకు తెలిసినంత
As far as I know about Periyar
పెరియార్ గురించి నాకు తెలిసినంత
పెరియార్ మనం చెప్పుకునే సంప్రదాయ సంస్కర్తా లేక హిందుత్వని/బ్రాహ్మణ వాదాన్ని గుడ్డిగా వ్యతిరేకించిన eccentric behaviour ఉన్న తలతిక్క మనిషా? చరిత్రలో పెరియార్ స్థానం ఏమిటి అని తెలుగునాట మరోసారి పునార్మూల్యాంకనం జరుగుతున్నట్లు ఉంది. పెరియార్ ఫక్తు కాంగ్రెస్ వాది. అయితే 1920 వ దశకంలో తమిళనాట గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కులాల వారీగా భోజనాలు వడ్డిస్తున్నారు అన్న అంశం మీద కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలోనే పెద్ద అంతర్గత సంఘర్షణే నడిచింది.
బ్రాహ్మణ ఆధిపత్యం-కుల వివక్ష
తిరునల్వేలి జిల్లాలో వి వి ఎస్ అయ్యర్ నడుపుతున్న గురుకుల పాఠశాలలో అక్కడ చదివే ఇద్దరు ఇద్దరంటే ఇద్దరు బ్రాహ్మల పిల్లలను మిగతా విద్యార్థుల నుండి వేరు చేసి వేరే గదిలో భోయనాలు వడ్డిస్తున్నారు ఇది కుల వివక్ష కిందకు వస్తుంది. తక్షణం ఈ పద్ధతిని విరమించాలని కాంగ్రెస్ పార్టీ లో ఈ వి రామస్వామి (పెరియార్), డాక్టర్ వరదరాజులు నాయుడు చర్చ లేవదీశారు. గురుకులం అనేది ప్రైవేటు పాఠశాల. దీని గురించి కాంగ్రెస్ పార్టీలో రగడ ఎందుకు వచ్చింది అని మనకు ఆశ్చర్యం కలగవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుండి ఈ గురుకులానికి ఆర్థిక సాయం అందుతుంది కాబట్టి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అప్పటికే అంటరానితనం నిర్మూలన, హరిజనోద్దరణ అన్న తీర్మానాలు చేసి ఉంది కాబట్టి. గురుకులం కుల వివక్షను పాటించే ఈ పద్ధతులు మానుకోకుంటే ఆ సంస్థకు ఆర్థిక సాయాన్ని నిలిపి వేస్తామని హెచ్చరిస్తూ కాంగ్రెస్ జాతీయ కమిటీ ఒక తీర్మానం చేసింది. అయినా తమిళనాడు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పక్కన పెట్టింది. దీనికి కారణం తమిళనాట కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం – బ్రాహ్మణ ఆధిపత్యం అని వేరుగా చెప్పనక్కరలేదు. As far as I know about Periyar
కులాల మధ్య అంతరాల నిర్మూలన కోసం..
ఇందుకు నిరసనగా పెరియార్, డాక్టర్ వరదరాజులు నాయుడు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కులాల మధ్యన అంతరాలు రూపు మాపే లక్ష్యంతో అనేక సామాజిక కార్యక్రమాలు తలకెత్తుకున్నారు. సహా పంక్తి భోజనాలు నిర్వహించారు. ద్రవిడ కజగం సంస్థను స్థాపించారు.ఈ క్రమంలోనే ఈ కుల వివక్షకు మూలం హిందూ మతం,దాన్ని నడిపిస్తున్న బ్రాహ్మణ వాదం లో ఉందని గ్రహించిన పెరియార్ రామస్వామి నాయకర్ మూలాల మీద తన దాడి ప్రారంభించాడు.ఈ దాడి మనం ఆశించిన పెద్ద మనిషి తరహాలోనో, గాంధీ గారి అహింసా పద్దతులలోనో ఉండకపోవచ్చు. హెడ్ ఆన్ కలిజన్ -ఢీి అంటే ఢీ – అనే పద్ధతిలో ఉండొచ్చు అంత మాత్రాన పెరియార్ కృషి తన అనుయాయులకు వినోదం కల్పించేది గానో, ఉద్రేక ఉద్వేగాలను సంతృప్తి పరిచేవి గానో స్థాయి తగ్గించి చూడనక్కర లేదు. As far as I know about Periyar
ఆధిపత్యం సంపాదించడానికి ద్వైత, అద్వైత, వైష్ణవ, శైవ సంప్రదాయాలు అన్నీ మడి కట్టుకుని తమ ధర్మ ప్రచారం చేసాయా.. చెవుల్లో సీసం కరిగించి పోయడాలు, నాలుకలు తెగకోయడాలు, పీఠాలు ధ్వంసం చేయడాలు వంటి అతి జుగుప్సాకరమైన హింసతో ఒకదాని మీద మరొకటి ఆధిపత్యం సంపాదించడానికి పోటీ పడినవే కదా.. అలాంటిది పెరియార్ బ్రాహ్మణ వాదం మీద/హిందూ మతం మీద చేసిన పోరాటం మాత్రమే ఉద్రేకపూరితం ఎందుకు అయ్యింది?
పెరియార్ సంస్కర్త ఎందుకు కాలేడు..?
గురజాడ, కందుకూరి వీరేశలింగం మున్నగు వారు ఫూలే, అంబేడ్కర్ ల మాదిరి భావజాల సృష్టికర్తలు కాదు కదా అయినా మనం వారిని తెలుగు నాట సంస్కర్తలుగా శ్లాఘిస్తున్నాం కదా.. ఆ ప్రమాణాలతో పెరియార్ సంస్కర్త ఎందుకు కాకుండా పోయాడు. సమాజంలో వ్యవస్థీకృతం అయిపోయిన అనాచారాన్నో, దురాచారాన్నో రూపుమాపడానికి ఎవరు కృషి చేసినా ఆయా స్థల కాల సామాజిక నేపథ్యాల నుండి వారి కృషిని అంచనా వెయ్యడం అంగీకృత ప్రమాణం. గురజాడ బాల్య వివాహాలను వ్యతిరేకించాడు. బాల్య వివాహ నిషేధ చట్టాలు వచ్చాయి. కానీ ఇప్పటికీ ఆ అనాచార అవశేషాలు అక్కడక్కడా మనం చూస్తూనే ఉన్నాం కదా. అందుకని గురజాడ సంస్కర్త కాకుండా పోతాడా? As far as I know about Periyar
సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా.. అలానే హిందూ మతం సృష్టించిన అమానుష వర్ణ వ్యవస్థ దానితో అంటు కట్టుకుని ఉన్న అంటరానితనం, కుల వివక్షలు ఇంకా సమసిపోలేదు కాబట్టి ఈ సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన పెరియార్ కృషిని బుట్ట దాఖలా చేయగలమా.. కుల వివక్ష, అంటరానితనం ఈ రెండిటినీ వ్యతిరేకించడమే పెరియార్ కు సంస్కర్తల సరసన స్థానం లేకుండా చేసిందా?
నా వరకు నేనైతే పెరియార్ ను నిరభ్యంతరంగా తమిళనాట సామాజిక సంస్కర్తగానే పరిగణిస్తాను.
మరి మీరో?!?
పిక్ క్రెడిట్స్ Tony Bekkal
Face book.. సత్య రంజాన్ కోడూరు