Header Top logo

చిత్రకారిణి  రుక్మిణీ వర్మ ప్రస్థానం

చిత్రకారిణి  రుక్మిణీ వర్మ ప్రస్థానం

వీరిని కలుద్దాం రండి..

భారతీయ ఆధునిక  చిత్రకళా పితామహుడు “రాజా రవివర్మ” వారసురాలు “రుక్మిణీ వర్మ.” రాజా రవివర్మ మనుమరాలు “రుక్మిణీ వర్మ” (Rukmini Verma ) …!! ‘రుక్మిణి వర్మ’1940 లో ట్రాంవెంకూరులో పుట్టారు. మౌంట్ కార్మెల్ కాలేజ్ (అటానమస్) లోచదివారు. ప్రస్తుతం బెంగుళూరు లో వుంటున్నారు. పూర్తిపేరు తిరునాళ్ రుక్మిణీ బాయిథంపూరన్. ఈమె ట్రావెంకోరు సంస్థానానికి “నాలుగోతరాని

కి చెందిన యువరాణి “,(Princess Bharani Tirunal Rukmini Bayi Thampuran of Travancore State,) రుక్మిణీ వర్మ గ్రాండ్ మదర్ మహారాణి  సేతులక్ష్మీబాయి (1895..1985) ట్రావెంకోరు  సంస్థా నాన్నిపరిపాలించారు. రుక్మిణీ వర్మ ఈమెకు ముద్దుల మనుమరాలు. అంతఃపురం గోడలపై తాత చిత్రాలను చూస్తూ పెరిగిందిరుక్మిణి.

అలా  చిన్నప్పటినుంచే చిత్రకళ పై ఆసక్తిని   పెంచుకుంది.తన గ్రాండ్  మదర్  స్థానికచిత్రకళాకారులను ప్రోత్సహించి, ఊతం ఇవ్వడంవల్ల కూడా రుక్మిణీలో చిత్రకళపట్ల ప్రేమ, అభిమానం పెరిగాయి. గ్రాండ్ మదర్ సేకరించిన అనేక విదేశీ చిత్రాలకు  కేటలాగ్ ను తయారు  చేసింది రుక్మిణీ వర్మ.

అలా రుక్మిణీ వర్మ చిత్రకళకు ఓ రకంగా తన తాత రవి వర్మ ప్రేరణతో గ్రాండ్ మదర్  ప్రోత్సాహం కూడా తోడైంది.దాంతో బాల్యం నుంచే రంగుల మేళవింపులో ప్రయోగాలు చేసింది‌ కొత్తపుంతలు తొక్కిచిత్రాలను చిత్రించింది రుక్మిణీ. రుక్మిణీ వర్మ ఆరో పుట్టిన రోజు సందర్భంగా ఆమె లోని టాలెంట్ ను గుర్తించిన మేనమామ బ్రష్ ల ఫుల్ సెట్,పెయింట్స్ కిట్ ను  బహూకరించారు.ఆరోజు ల్లో ఈ కిట్ ను బొంబాయి నుంచి తెప్పించారట.

కేవలం చిత్రకళ పట్ల మాత్రమే గాక నృత్యం, సంగీతం పట్ల కూడా రుక్మిణీ లోని  ఆసక్తిని గమనించిన గ్రాండ్మదర్ వెన్నుతట్టి ప్రోత్స

హించింది  .భరత నాట్యం, మోహినీయా ట్టమ్,కథక్ తదితర నృత్యరీతుల్లో  శిక్షకులను నియమించి,ప్రత్యేక శిక్షణ యిప్పించింది.

అలాగే చరిత్ర,మతం, ఆర్కిటెక్చర్.సంస్కృతీ, సాంప్రదాయాల్లోరుక్మిణీ వర్మకు ప్రవేశం కలగడానికి‌ దోహదపడింది.

*తాత అడుగు జాడల్లో…!!

తన తాతగారైన రాజా రవివర్మ ఛాయల్లోనే సాంప్రదాయిక చిత్రకళకు ఊపిరిపోశారు. రాజా రవివర్మ వంశానికి మాత్రమే గాక  ఆయన చిత్రకళా వారసత్వానికి కూడా రుక్మిణీ వర్మే నిజమైన వారసురాలు. అంతే కాదు…..తన తాతగారి పేరిట  నెలకొల్పిన ” “రాజా రవివర్మ హెరిటేజ్ ఫౌండేషన్. ” ద్వారా రాజారవివర్మ కళాత్మక వారసత్వ సంరక్షకురాలుగా కూడా ఆమె కొనసాగుతున్నారు‌.

రుక్మిణీ వర్మ..కేరళ ‘త్రివేండ్రం’ లోని’సాటెల్మండ్ ప్యాలెస్ ‘ మరియు మౌంట్ కార్మెల్ కాలేజీ ‘  లో, అలాగే బెంగళూరు లో చిత్రకళలో  శిక్షణ పొందారు.రవివర్మ దారిలోనే.. కనీసరంగుల్ని మేళవించి తనదైన ప్రత్యేక ముద్రతో తైలవర్ణ  చిత్రాలను చిత్రీకరించారు.

*రచయిత్రి గా…!!

కేవలం చిత్రకారిణి గానే కాదు. రచయిత్రి గా కూడా రుక్మిణీ వర్మ రాణించారు.

1.హిడెన్ ట్రూత్ (Hidden truth)

2..రాజా రవివర్మ ( Raja Ravivarma)

3.ది ఇన్ సైడ్ స్టోరీ  (The inside Story )

అనే మూడు పుస్తకాలను రచించారు. తనతాతభారతీయ ఆధునిక చిత్రకళా పితామహుడు….. ‘రాజా రవివర్మ’ కు నీరాజనంగా ఈ పుస్తకాలను  రాశారు రుక్మిణీ వర్మ.!!

ఎ.రజాహుస్సేన్, రచయిత

Leave A Reply

Your email address will not be published.

Breaking