Header Top logo

మరో రూపంలో కరోనా… అదే నోరో వైరస్

కొచ్చి(కేరళ): కేరళ రాష్ట్రంలో కొత్తగా నోరో వైరస్ వెలుగుచూసింది.(Norovirus)కక్కనాడ్ పట్టణంలోని(Kerala school) ఓ ప్రైవేటు స్కూలుకు చెందిన 62 మంది విద్యార్థుల్లో వాంతులు, డయేరియా లక్షణాలు బయటపడ్డాయి..

పాఠశాలలో 1,2వతరగతులు చదువుతున్న విద్యార్థుల నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్ష కోసం లాబోరేటరీకి పంపించామని జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి చెప్పారు. పాఠశాల తరగతి గదులతోపాటు టాయ్ లెట్లలో ఇన్ఫెక్షన్ వెలుగుచూసింది.పాఠశాల విద్యార్థులకు నోరో వైరస్ సోకడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నోరో వైరస్(outbreak confirmed) నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు రక్షిత మంచినీటిని అందించాలని నిర్ణయించారు..

నోరో వైరస్ లక్షణాలు డయేరియా, వాంతులు, స్వల్ప జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో పిల్లలు బాధపడుతున్నారు.కలుషితమైన నీరు, ఆహారం వల్ల నోరో వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్యాధికారులు చెప్పారు. కేరళ రాష్ట్రంలో 19 మంది పిల్లలకు నోరో వైరస్ పాజిటివ్ అని తేలడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. మరుగుదొడ్డికి వెళ్లి వచ్చాక, భోజనం చేసేముందు సబ్బుతో చేతులు కడుక్కోవాలని వైద్యాధికారులు సూచించారు. క్లోరినేట్ చేసి, కాచిన నీటిని తాగాలని వైద్యులు కోరారు. పండ్లు, కూరగాయలను బాగా కడిగి తినాలని వైద్యాధికారులు సలహా ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking