Header Top logo

కరోన కారణంగా కళాశాలలు, పాఠశాలలు మూసివేయాలని డిమాండ్ చేసిన – (NSUI)అనంతపురం జిల్లా అధ్యక్షులు రాంబాబు

AP 39TV 18 ఏప్రిల్ 2021:

కరోనా రెండోసారి విజృంభిస్తున్న కారణంగా కళాశాలలు, పాఠశాలలు మూసివేయాలని అనంతపురం జిల్లా అధ్యక్షులు రాంబాబు డిమాండ్.
కరోనా మహమ్మారి రెండోసారి విజృంభిస్తున్న కారణంగా ఈసారి కూడా కళాశాలలు మరియు పాఠశాలలు అన్ని మూసివేయాలని ఎన్ ఎస్ యు ఐ అనంతపురం జిల్లా అధ్యక్షులు కోనాపురం రాంబాబు కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి చూడాలని ఆయన అన్నారు. గతంలో లాగానే ఈసారి కూడా కరోనా కేసులు ఎక్కువ గా పెరుగుతుండడం వలన వెంటనే ఉన్నత అధికారులు ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాము. దేశంలో రోజురోజుకీ కరోన పెరుగుతున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు సెలవు దినాలు ప్రభుత్వం ప్రకటించాలని అలాగే విజృంభిస్తున్న కరోనా కేసులు విస్తృతంగా ఉన్నాయి కాబట్టి దీనిపై విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా అలాగే ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన కల్పించి ప్రజల అనారోగ్యంతో బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే అని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking