Header Top logo

డీజీపీని క‌లిసిన టీపీసీసీ నేత‌ల బృందం

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, ఇత‌ర నేత‌ల‌తో క‌లిసి సోమ‌వారం సాయంత్రం డీజీపీని క‌లిశారు.

12మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు , నాగర్ కర్నూలులో కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆరెస్ నేతల దాడుల అంశాలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు.

నాగ‌ర్ కర్నూల్ జిల్లాలో ప్రాజెక్టు శిలాఫలకాన్ని సందర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ నేత‌లు దూషనలు, దాడులకు దిగారని రేవంత్ తెలిపారు.

గొంతుపై కాలు పెట్టి తొక్కి పరుష పదజాలంతో దూషించారని, దాడికి గురైన బాధితుల్లో ఒకరు గిరిజనుడు, మరొకరు దళితుడు ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు.

దాడికి పాల్ప‌డిన వారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారని భావించామ‌ని, కానీ త‌మ పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డిపైనే అక్రమ కేసులు పెట్టారని రేవంత్ మండిప‌డ్డారు.

ఇది ప్రభుత్వం, పోలీసుల బరితెగింపు చర్య అన్నారు రేవంత్. నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులకు నిరసనగా ఈ నెల 17న దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామ‌ని చెప్పారు.

నాగ‌ర్ క‌ర్నూల్ దాడి ఘ‌ట‌న‌తో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు కోరుతూ మ‌రో ఫిర్యాదును కూడా అందించామ‌న్నారు.

12 మంది పిరాయింపు ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరిన‌ట్లు రేవంత్ తెలిపారు.

ఈ అంశంపై చీఫ్ సెక్రటరీని అపాయింట్ మెంట్ కోరితే తప్పించుకు తిరుగుతున్నారని, సీఎస్ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఇలా చేస్తే సీఎస్ ఉద్దేశపూర్వకంగానే అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలకు వత్తాసు పలుకుతున్నట్లు కాంగ్రెస్ భావించాల్సి వస్తుందన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల 12 నియోజకవర్గాల్లో సంక్రాంతి తరువాత కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking