AP 39TV 31మార్చి 2021:
వై.యస్.ఆర్ బీమా పథకం కింద అర్హత ఉండి బ్యాంకులలో నమోదు కాని వారిలో ప్రీమియం చెల్లించకపోయినా,దురదృష్టవశాత్తు కుటుంబంలోని సంపాదనపరుడు మరణించిన వారికి రాష్ట్ర వ్యాప్తంగా 12039 కుటుంబాలకు మానవతా దృక్పథంతో బీమా క్లెయిమ్ కు సమానమైన రూ.254 కోట్లను చెల్లించనున్న ప్రభుత్వం.తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీమా పరిహారాన్ని విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.అనంతపురం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖామంత్రి వర్యులు శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ, ఎంపీ శ్రీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)ఏ.సిరి, డిఆర్డీఏ పిడి నరసింహా రెడ్డి, మెప్మా పిడి రమణారెడ్డి, అసంఘటిత కార్మికుల కుటుంబ సభ్యులు.