మహిళలు/ అమ్మాయిల్లో భరోసా కల్పించేలా పని చేయండి
– జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలోని దిశ కానిస్టేబుళ్లతో ప్రత్యేక సమావేశం… దిశా నిర్ధేశం . జిల్లాలో మహిళలు/ అమ్మాయిల్లో భరోసా కల్పించేలా గట్టిగా పని చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారు సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలోని దిశ కానిస్టేబుళ్లతో ఆయన గురువారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. ప్రభుత్వం, పోలీసుశాఖలు సదుద్ధేశ్యంతో మహిళా నేరాలు అరికట్టడం… ముందస్తుగా నియంత్రించడం కోసం దిశ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాలను పంపిణీ చేసిందని… వీటిని ప్రాధాన్యతగా ఆయా పోలీసు స్టేషన్లకు పంపుతున్నామన్నారు. ఈ వాహనాలను ఉపయోగించి మహిళల్లో భరోసా కల్పించాలన్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, తదితరాలకు ఇళ్లు వదిలింది మొదలు ఇళ్లు చేరుకునేంత వరకు అమ్మాయిలు/ మహిళలకు భద్రతకు అండగా నిలవాలన్నారు. ఏ సమయంలో పోలీసు సహాయం కోరినా ఏమాత్రం అలసత్వం లేకుండా తక్షణమే స్పందించి సేవలు అందించాలని సూచించారు. విద్యాసంస్థలు, హాస్టళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు, దేవాలయాలు, శివారు ప్రాంతాలు… ఇలా ఎక్కడైనా సరే మహిళలు స్వేచ్ఛగా తిరగాడేలా భరోసా ఇవ్వాలన్నారు. అంతేకాకుండా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి ముందస్తు చర్యలలో భాగంగా నేరాలు జరుగకుండా మరియు భారిన పడకుండా అప్రమత్తంగా ఉండేలా చైతన్యం చేయాలన్నారు. మహిళా చట్టాలపై అవగాహన చేసి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎస్ వెంకటరావు, జె రామమోహనరావు, రామకృష్ణప్రసాద్ , హనుమంతు… డీఎస్పీలు ఉమామహేశ్వరరెడ్డి, వీరరాఘవరెడ్డి, ప్రసాదరెడ్డి, మురళీధర్ ,ప్రసాదరావు, ఆర్ ఐ లు పెద్దయ్య, టైటస్ , శ్రీశైలరెడ్డి, నారాయణ, శివరాముడు, పెద్దన్న, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ , సుధాకర్ రెడ్డి, తేజ్ పాల్ , పలువురు ఆర్ ఎస్ ఐలు,తదితరులు పాల్గొన్నారు.