Header Top logo

విద్యా దీవెన దరఖాస్తుకు అదనపు సెంటర్లను ఏర్పాటు చేయాలి, ఏఐఎస్ఎఫ్

విద్యా దీవెన దరఖాస్తుకు అదనపు సెంటర్లను ఏర్పాటు చేయాలి, ఏఐఎస్ఎఫ్
దరఖాస్తుకు తేదీ ను పొడగించాలి,
త్రాగునీరు సౌకర్యం లేకపోవడం చాలా బాధాకరం,
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాలలో ధర్నా,
(అనంతపురము జిల్లా, సిటీ)
ఆర్ట్స్ కళాశాలలో విద్యా దీవెన దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అదనపు సెంటర్లను ఏర్పాటు చేయాలని, విద్యా దీవెన దరఖాస్తు తేదీ ని పొడిగించాలని గురువారం నాడు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాలలో ధర్నా నిర్వహించారు, ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తక్షణం విద్యా దీవెన అప్లై చేసుకోవడానికి అదనపు సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ కావడంతో అనేక మంది విద్యార్థులు అప్లై చేసుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని దరఖాస్తు తేదీలు కూడా పొడిగించాలని డిమాండ్ చేశారు, విద్యా దీవెన దరఖాస్తు కొరకు కళాశాలలోని ప్రతి కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ లను విద్యార్థుల సౌలభ్యం కొరకు ఉపయోగించుకోవాలని డిమాండ్ చేశారు, గత వారం రోజులుగా ఓకే సెంటర్ని ఏర్పాటు చేసి విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు, అతి పెద్ద కళాశాల ఆయిన ఆర్ట్స్ కళాశాలలో ఒక కంప్యూటర్ ల్యాబ్ లో కనీసం వంద కంప్యూటర్లకు పైబడి ఉన్నాయని వాటిని ఉపయోగించకుండా సిబ్బంది లేరని అక్కడ ఉన్న వారికి ఎటువంటి అవగాహన లేదని ప్రిన్సిపాల్ గారు కుంటి సాకులు చెప్పడం సరైన పద్ధతి కాదని అన్నారు, రాత్రి, పగలు విద్యార్థిని, విద్యార్థులు అక్కడే పడిగాపులు కాస్తున్నారని సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన విద్యార్థులు హాస్టల్ సదుపాయం లేక రాత్రిపూట కళాశాలలోనే నిద్రించిన దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అని అన్నారు, రాత్రి పగలు విద్యార్థులు విద్యా దీవెన దరఖాస్తు కోసం నిలబడి నిరీక్షిస్తున్న సమయంలో విద్యార్థులకు త్రాగునీటి సదుపాయం మరియు విద్యార్థినిల కాలికృత్యాలు తీర్చుకోవడానికి సరైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆర్ట్స్ కళాశాలలో దాపురించాయి అని అన్నారు, ఆర్ట్స్ కళాశాల పూర్తిగా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు, విద్యార్థులకు అనుగుణంగ పరిపాలన కొనసాగించాలి తప్ప ప్రిన్సిపాల్ గారు మరియు అక్కడ సిబ్బందికి అనుగుణంగా పరిపాలన కొనసాగడం సరైన పద్ధతి కాదన్నారు, ఇప్పటికైనా కళాశాలలో విద్యార్థులకు అనుగుణంగా విద్యార్థుల సమస్యల పరిష్కారం దిశగా ఆర్ట్స్ కళాశాలలో నిర్ణయాలు తీసుకోవాలని లేనిపక్షంలో భవిష్యత్తులో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చేపడతామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి రమణయ్య, జిల్లా ఉపాధ్యక్షులు వీరు యాదవ్, నగర నాయకులు రజినీకాంత్,ఈశ్వర్,నవీన్, వంశీ, కిరణ్, నరసింహ, నాగార్జున, బాబా, మళ్లీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking