Header Top logo

Why kill a gill తొండను ఎందుకు చంపుతారు..?

Why kill a gill ..?
తొండను ఎందుకు చంపుతారు..?

ప్రశ్న: ముస్లిం మతానికి చెందిన పిల్లలకు “తొండ” కనబడితే దాని వెంటబడి తరిమి, తరిమి చంపుతారంటారు. నిజమేనా ? అది నిజమే ఐతే వారు అలా ఎందుకు చేస్తారు ??

జవాబు: అది కొంత వరకు నిజమే. కానీ దాన్ని ఒక మూఢనమ్మకం కిందే జమ కట్టాలి. మూఢనమ్మకాలలో మగ్గిన వారే అలా చేస్తారు. ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరూ అలా అకారణంగా (సకారణంగా ఐనా సరే) ఇతర ప్రమాదరహిత (లేదా ప్రమాదకరమైన) జీవులను చంపరు. ఓ 30, 40 సంవత్సరాల క్రితం పళ్ళెటూళ్ళలో ఉండే ముస్లిం పిల్లలు అలా తొండ కనబడితే దాని వెంటబడి చంపేసే వారనేది వాస్తవమే. అయితే వారిలో ఇపుడేమైనా మార్పు వచ్చిందో లేదో ఆ మూఢనమ్మకం ఆ వర్గం పిల్లల్లో ఇప్పటికింకా కొనసాగుతుందో లేదో నాకు తెలియదు. (తెలిసిన వారు చెప్పాలి).

తొండను చంపడానికి కారణం..?

ఆ రోజుల్లో ఆ పిల్లలు “తొండల” వెంటపడి చంపడానికి మా చిన్నప్పటి ముస్లిం మిత్రుడొకరు చెప్పిన కారణం ఏమిటంటే..? వాళ్ళ మతానికి సంబంధించిన ఒక “కథ”లో “తొండ”ను ఒక ద్రోహి (విలన్) గా పరిచయం చేసారట. ఆ కథ ప్రకారం..
“Karwala మైదానంలో మత యుద్ధం జరిగినప్పుడు. హసన్, హుస్సేన్ దాచుకున్న చోట తొండ (పాపం దాని సహజసిద్ధమైన మేనరిజం వల్ల) దాని తలను (ఉదరభాగాన్ని) పైకి కిందకి కదిపితే (Push Ups చేస్తే), ఆ తొండ ను చూసిన శత్రువులు, వారిరువురూ అక్కడే దాక్కున్నారని, “తొండ తన ఉదరభాగాన్ని పైకీ కిందికీ కదిపి, సైగ చేసి చూపించిందని” భావించి వారిరువురిని పట్టుకుని హతమార్చారని అందుకే శత్రువులతో చేయికలిపి, హసన్, హుసేన్ లకు ద్రోహం చేసిన “తొండ”ను అది ఎక్కడ కనపడినా చంపాలని నిర్ణయించుకున్నారట. అలా చేస్తే చనిపోయిన తర్వాత స్వర్గ ప్రాప్తి కలుగుతుంది నమ్ముతారంట.”

ఇంకో విషయం ఏమిటంటే… ?

ఆ తొండ ని శుక్రవారం రోజు చంపితే బీద వారికి సగం రొట్టెను దానం చేసిన పుణ్యం కూడా లభిస్తుందని ప్రాచారం లో ఉన్నది. ఏ మతంలో అయినా ఆయా మతాలకు సంబంధించిన పౌరానిక కథలను “చరిత్రలో జరిగిన సత్యాలుగా నమ్మితే” ఆ మతాన్ని ఫాలో అయ్యే వారు మూఢ నమ్మకాలలో కూరుకు పోతారు.

సేకరణ :
Rajeshwer Chelimela , Jvv Telangana

(This is based on a comment of స్వేచ్ఛ జీవి గారు..)

Leave A Reply

Your email address will not be published.

Breaking