Bajjora ..! Smaller than that.! బజ్జోరా..! చిన్ని కన్నా.!
Bajjora ..! Smaller than that.!
బజ్జోరా..! చిన్ని కన్నా.!
పడకలేల? పాన్పులేల ?
హంసతల్పాలేల ?
నిదురించు చోటు దొరికిన చాలు
మైమరచి విశ్రాంతి తీసుకొనుటే మేలు!!
జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా
జో జో జో జో జో జో జో
బజ్జోరా నా చిన్ని తండ్రీ బజ్జో
టైరులైనా నేమి? ట్యూబులైనానేమి?
ఇయ్యాల ఉయ్యాలగా మారెనుగా
మేను మరచి హాయిగా నిదురించరా
లోకాన బాధలతో నీకేమి?
నీ బుజ్జి మనసును బజ్జోబెట్టరా చిన్ని కన్నా…!!