Header Top logo

26జనవరి రిపబ్లిక్ దినోత్సవం ఎందుకు జరుపుతారు

జెండా వందనం..

ఇది ఇండియాలోని సిటిజన్స్ పండుగ.         

 చదువుకునే విద్యార్థులకైతే ఈ జెండా పండుగ వస్తుందంటే ఆ సంతోెషాన్ని అక్షరాలలో రాయలేను. రిపబ్లిక్ దినోత్సవం కావచ్చు లేదా స్వాతంత్య్ర దినోత్సవం కావచ్చు. 

ఈ జెండా పండుగలకు వారం రోజుల ముందు నుంచే పిల్లలతో స్కూల్ లలో గేమ్స్ ఆడిస్తారు.

ప్రతిభ ఉన్న విద్యార్థులకు జెండా వందనం రోజు బహుమతులు అంద చేస్తారు.

జెండా ఆవిష్కరించిన తరువాత ఊళ్లో.. పట్టణాలలో, నగరాలలో విద్యార్థులు జెండాలను చేతబట్టి దేశభక్తి నినాదాలు చేస్తూ వెళుతారు.

రిపబ్లిక్ డే ఎందుకు చేస్తారు..? 

జనవరి 26వ తేదీన రిపబ్లిక్ దినోత్సవం (జెండా పండుగ) ఘపంగా నిర్వహిస్తారు. ప్రతి పౌరుడు దేశభక్తితో త్రివర్ణ పథకంకు సెల్యూట్ చేయాల్సిందే. భారత దేశ చరిత్రలోనే ఆ జెండాకు విశిష్ణత ఉంది.

బిజినెస్ కోసం బ్రిటీష్ వాళ్లు వచ్చి…

బతుకు తెరువుకు బ్రిటీష్ నుంచి వచ్చిన తెల్ల దొరలు ఇక్కడి పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని దేశాన్ని పరిపాలన చేసే స్థాయికి ఎదిగారు. రెండు వందల ఏళ్లు మనలను బ్రిటీస్ దొరలు పాలన చేశారు.

బ్రిటీష్ పాలకుల చేతిలో బందిగా ఉన్న భారతమాతను విడిపించడానికి అల్లూరి, భగత్ సింగ్, చందరశేఖర్ ఆజాద్, రాజగురు, సుఖ్ దేవ్, సుభాస్ చంద్రబోస్ లాంటి వారు ప్రాణ త్యాగం చేశారు. సుదీర్ఘ పోరాటం తర్వాత 1947లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది.

అయితే, 1947 ఆగస్టు 15న స్వాతంత్ర వచ్చినా, 1950వ దశకంలోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది. స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా 1950 జనవరి 26న భారత్ అవతరించింది. అదే రిపబ్లిక్ డే.

అందుకే భారతీయులుగా మనం జనవరి 26 వ తేదీన రిపబ్లిక్ దినోత్సవం జరుపుకుంటాం..

విష్ యు హెప్పి రిపబ్లిక్ డే…

  • మారబోయిన మాన్విక్ రుద్ర

 

Leave A Reply

Your email address will not be published.

Breaking