Header Top logo

కోడిమి జర్నలిస్ట్ కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తాం – మచ్చా రామలింగారెడ్డి (A.P.W.J.U)

కొడిమి జర్నలిస్ట్ కాలనీ రాష్ట్రానికి ఆదర్శం జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటం

కోడిమి జర్నలిస్ట్ కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తాం

మచ్చా రామలింగారెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు
(A.P.W.J.U)

జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటులో మచ్చా రామలింగారెడ్డి సేవలు ఎనలేనివి
ఆజాద్,
భోగేశ్వర రెడ్డి.
===================

రాష్ట్రంలోని జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని కరోనా సమయంలో జర్నలిస్టు చాలా ఇబ్బంది పడుతున్నారని సీ.ఎం వైఎస్ జగన్ జర్నలిస్టుల సమస్యలపై దృష్టి పెట్టాలని మచ్చా రామలింగారెడ్డి అన్నారు.

ఈ రోజు సాయంత్రం కోడిమి జర్నలిస్ట్ కాలనీ నందు బటర్ ఫ్లై లైట్లు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ కొడిమి జర్నలిస్ట్ కాలనీ రాష్ట్రంలోని జర్నలిస్టులు అందరికీ ఆదర్శమని అనంతపురంలో 20 ఏళ్ళ పోరాట ఫలితంగా ఈ కాలనీ ఏర్పడిందని గుర్తు చేశారు
జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటులో అనేక కష్టాలు పడ్డానని కోర్టు కేసులను ఎదుర్కొని.. సొంత డబ్బు వెచ్చించి కాలనీ ఏర్పాటు చేశానని గుర్తు చేశారు.

కోడిమి జర్నలిస్ట్ కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఎంపీ మాధవ్, కలెక్టర్ తో మాట్లాడి కాలువలు డ్రైనేజీ లో ఏర్పాటు చేస్తామని మచ్చా రామలింగారెడ్డి అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉద్యమం చేస్తామని జర్నలిస్టుల సమస్యలు అక్రిడేషన్లు హెల్త్ కార్డు ఇతర సమస్యలపై రాజీలేని పోరాటం నిర్వహిస్తుందని అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ ఆజాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్ట మొదటి జర్నలిస్ట్ కాలనీ ఇది అని, కాలనీ అభివృద్ధి కోసం మచ్చా రామలింగారెడ్డి 20 ఏళ్లుగా నిరంతరం కృషి చేస్తున్నారు అని అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ భోగేశ్వర రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్ట్ కాలనీ చాలా అభివృద్ధి చందింది అని సంతోషం వ్యక్తం చేశారు. చరిత్రలో మచ్చా రామలింగారెడ్డి పేరు నిలిచిపోతుంది అన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ కార్యదర్శి విజయరాజు, Tv9 కెమెరా మ్యాన్ విజయ్, భాస్కర్ రెడ్డి, షాకీర్ ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్షులు ఉపేంద్ర కార్యదర్శి చలపతి APJDS నగర్ అధ్యక్ష కార్యదర్శులు శ్రావణ్ బాలు
జానీ శ్రీకాంత్ హనుమంత్ రెడ్డి, దాదు, అది నారాయణ, మల్లికార్జున, ప్రకాష్, తదితర జర్నలిస్టులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking