Header Top logo

దళితుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తాం – బొందిమడుగుల టీ ఎం రమేష్ మాదిగ

AP 39TV 06ఏప్రిల్ 2021:

కర్నూలు నగరం నందు ఆర్ఎస్ రోడ్డు కూడలి లో ఉన్న బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి 114 వ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ అధ్యక్షతన పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి జోహార్లు తెలపడమైనది.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టీ ఎం రమేష్ మాదిగ  మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రావు దేశంలోని మొట్టమొదటి ఉప ప్రధానిగా కార్మికశాఖ మంత్రిగా సేవలందించి కార్మికుల హక్కుల కోసం ఎనలేని కృషి చేశారు.అదేవిధంగా రక్షణశాఖ మంత్రిగా చేసి దేశ రక్షణ కొరకు సేవలందించి ఓటమి ఎరుగని నేతగా ఉన్నత పదవులు స్వీకరించి
వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందేవిధంగా నిరంతరం దళితుల హక్కుల కోసం అంటరానితనం నిర్మూలన కోసం తన పదవికి రాజీనామా చేసి దళితుల ఘోష ప్రభుత్వాలకు వినిపించిన ఉన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రావు అని మాట్లాడడం జరిగింది.
అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడం లో విఫలం చెందడం దళితులను అణచివేతకు గురి చేయడమే నిదర్శనంగా పాలకులు చేస్తున్నారు అని చెప్పి సభను ఉద్దేశించి ఆవేదన వ్యక్తం చేయడమైనది. ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దళితుల సమస్యలు దళితులపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు అవమానాలు దళిత ప్రజలపై అధికారులపై ఐఏఎస్ పై జరుగుతున్న వివక్షతను నిర్మూలించడంలో ప్రభుత్వాలు చోద్యం చూడం సిగ్గుచేటని ఇప్పటికైనా ప్రభుత్వాలు వివక్షత అంటరానితనం నిర్మూలించి వెనకబడిన షెడ్యూల్ క్యాస్ట్ వారికి స్వేచ్ఛ సమానత్వం మే మానవత్వం గా ఉండేందుకు దళితులకు అండగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. దళితులు ఐక్యమత్యంతో డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్షీరామ్ జ్యోతిరావు పూలే ఆశయ సాధన కొరకు నిరంతరం ప్రభుత్వాలపై పోరాటాలు చేసి దళితుల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలియపరుస్తూ డిమాండ్ చేయడమైనది.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎస్ కర్నూల్ సిటీ ప్రెసిడెంట్ గోవింద మాదిగ,ఎమ్మార్పీఎస్ ఎస్ కర్నూల్ సిటీ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking