Header Top logo

Vamsi are our palasa powder stories వంశీ మా పలస పూడి కథలు

Vamsi are our palasa powder stories

వంశీ మా పలస పూడి కథలు

ఆయ్..! మాది పసలపూడండి …నన్ను ‘వంశీ ‘ అంటారండీ !!
కోనసీమ అందాలు…లేత కొబ్బరి తియ్యందనాలు,కొత్త బియ్యం,బెల్లం పరమాన్నం రుచి,వేడి అన్నంలో బాతు గుడ్లూ ,తియ్యకంద పులుసు వేసుకొని తింటే జివ జివలాడే నాలుక.ఎలా వుంటాయి ? అదిగో సరిగ్గా అలాగే వుంటాయండీ మా వంశీ కథలు.

కేవలం ప్రకృతమ్మ సొగసులే కాదండోయ్. .అక్కడి మనుషులు, వాళ్ళ మనస్తత్వం, ముఖ్యంగా మాటల్లోని ఎట ‘కారం’. మనుషుల్లోని మమకారం కలగలిపి కథల్లో...హహ వడ్డించాడు వంశీ.ఇక గోదావరి తీరప్రాంత పిండి వంటలూ,

“ఆనాటి వాన చినుకులతో “ తెలుగు పాఠకల్ని నిండా తడి పేసి గోరు వెచ్చని ఎండలో ఆరబెట్టేశాడు. పసలపూడికథల
తో జెండా పాతిన వంశీ ఆతర్వాత వెనక్కి తిరిగి చూసుకో లేదు. గోదారి నేపథ్యంగా వచ్చిన….”మా దిగువగోదారి కథలు” వంశీని కథల మాంత్రికుడ్ని చేశాయి.“ఆకుపచ్చని జ్ఞాపకాల” కథలతో గుండెను అదిలించి,కదిలించాడు. ఆ చెమ్మ ఇంకా ఆరలేదు. గోదావరికి వంశీకి మధ్య ఏదో లంకె వుందండీ..లేకుంటే వంశీ కథ రాయకపోతే గోదారమ్మ ముఖం ముడిచి సిన్నబుచ్చేసుకుంటుంది మరి!!

వాడుక భాషను వేడుక చేస్తూ

తూగోజి..అదేనండీ తూర్పుగోదావరి జిల్లా సామాజిక నేపథ్యంగా,అక్కడి వాడుక భాషను వేడుక చేస్తూ,యాసతో ఊపిరిపోసి,పలుకుబళ్ళతో జిలుగు పెట్టి మరీ రాశాడండి పసలపూడి కథలు. నిజానికి తూగోజిల్లాలో పసలపూడి ఓ మారుమూల కుగ్రామం. వంశీ కథలతో ఇప్పుడావూరికిసెలబ్రిటీ హోదా వచ్చేసింది.మొత్తం 72 కథల సంపుటిది.అన్నీ స్వాతి వారపత్రికలో సీరియల్ గా అచ్చయ్యాయి. ఆ తర్వాత సంపుటిగా వచ్చి ముద్రణల మీద ముద్రణలు వచ్చేశాయి.ఆ కథలకున్న పాపులారిటీ, గిరాకీ పులసచేపలక్కూడా లేదంటే నమ్మండి!!

గోదావరమ్మ పొడవున నడచాడు వంశీ

బిడ్డగా గోదావరమ్మ కొంగు పట్టుకొని తీరం పొడవున నడచాడు వంశీ.దారెంట తనకు కంట పడిన దృశ్యాల్ని, చిత్రాల్ని తన కలం కెమెరాలో బంధించాడు. బాపు బొమ్మ లో కనిపించే ఒంపు సొంపులన్నీ వంశీ కథల్లో కనిపిస్తాయి.

ఉదాహరణకు….!

కాటన్ దొర తవ్వించిన కాల్వ వెంట కనిపించే ఎర్ర కంకర రాళ్ళు కూడా వంశీ కథల్లోతళుక్కున మెరుస్తాయి. ఇక వడ్లమూడి నారింజ పళ్ళ కావిళ్ళూ,కుప్ప తెప్పలుగా తేగల గంపలూ, మినీ లారీలోడును తలపించే అరటిగెలల సైకిళ్ళూ,దమ్ముచేస్తున్నచేలల్లో పురుగులేరుకొని తినే తెల్ల కొంగలు,పుంతరేవు గట్టు దిగువలో మొలచిన పోతు బొబ్బాసి చెట్టు పొడుగాటి కాడల్తో పూసిన తెల్లపూలు ఇలా ఒకటేమిటి‌ గోదారమ్మ ప్రకృతి వన్నె చిన్నెలన్నీ వంశీ కథల్లో అలవోగ్గా ఒదిగిపోతాయి.ఒయ్యారాలు బోతాయి.

మనుషుల్లోని మమకారం కథల్లో

కేవలం ప్రకృతమ్మ సొగసులే కాదండోయ్. .అక్కడి మనుషులు, వాళ్ళ మనస్తత్వం, ముఖ్యంగా మాటల్లోని ఎట ‘కారం’. మనుషుల్లోని మమకారం కలగలిపి కథల్లో…హహ వడ్డించాడు వంశీ.ఇక గోదావరి తీరప్రాంత పిండి వంటలూ, కమ్మని కూరలూ, నోరూరించే పచ్చళ్ళూ వంశీ కథల్లో రుచి చూడాల్సిందే.

ఇక ఆలస్యం ఎందుకు? తినబోతూ రుచి అడగటం దేనికి? వెంటనే మీరూ “పసలపూడి కథలు “ చదివేసి ఆ ఆనందమేదో అనుభవించేయండి.. ఆయ్ !!

abdul rajahussen

ఎ.రజాహుస్సేన్…!!

Leave A Reply

Your email address will not be published.

Breaking