Header Top logo

చైనాలో కరోనాతో సహ జీవనం..

చైనాలో విదేశీయుల ప్రవేశంపై కరోనా ఆంక్షలు తొలగింపు

కరోణ మహ్మరితో నరకం అనుభవిస్తున్న ప్రజలు..

బీజింగ్: కరోనా…  మళ్లీ హింసిస్తోందిరో.. ఈ మాయదారి కరోనా లాంటి విషాద గీతం పాట పాడాలనెమో… చైనాలో పుట్టిన కరోనా ఇప్పుడు ఆ దేశాన్ని పట్టి పీడిస్తోంది. కమ్యూనిష్టు దేశమైన చైనాలో కఠినమైన నిర్ణయాలు తీసుకున్న కరోనా అదుపులోకి రాలేక పోతుంది. మరోె రూపంలో ఇండియాలోకి వస్తున్న కరోనాపై సోషల్ మీడియాలో పెళ్లి కార్డు వైరల్ అవుతుంది.

కరోనా మహమ్మారిని కంట్రోల్ చేస్తునే దానితోనే కలిసి జీవించడానికి చైనా దేశం సిద్దమైంది. 2019లో వుహాన్ లో కరోనా బయట పడిన తరువాత కరోనా అదుపు కోసం విధించి ఆమలు చేస్తున్న ఆంక్షలను అంచెల వారిగా తొలగిస్తున్నారు.

చైనాకు వెళ్లే విదేశీయులు ఇకపై క్వారంటైన్ కు వెళ్లాల్సిన పని లేదని జనవరి 8 నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఆ దేశ నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా ఐదు రోజులపాటు హోటల్‌లో, ఆ తర్వాత మూడు రోజులు ఇంట్లో క్వారంటైన్‌లో ఉండాల్సిందే.

ఇప్పటి వరకు ‘జీరో కొవిడ్’(Zero Covid) విధానాన్ని అనుసరిస్తూ వస్తున్న చైనా తాజా నిర్ణయం పెద్ద యూటర్నేనని చెబుతున్నారు.చైనాలో కరోనాతో రోగులు హాస్పిటల్స్ లలో కిక్కిరిసి పోతున్నారని నేషనల్ మీడియా పేర్కొంటుంది. కరోనా మహ్మరికి బలైన శవాలతో బంధువులు అంత్యక్రియలు చేయడానికి బారులు తీరుతున్నట్లు వార్త కథనాలు వస్తున్నాయి.

చైనాలో చావు కేకలు.. మరీ భారత్ పరిస్థితి ఏమిటీ..?

కరోనా మహ్మరి వల్ల ప్రపంచమే వణికిన రోజులు.. మూడేళ్ల క్రితం కరోనా పేరు చెబితే వణికి పోయిన భారత్ ప్రజలు ఇప్పుడిప్పుడే మరిచి పోతున్నారు. అయితే.. ఇటీవల చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తుందని వార్త కథనాలు రావడంతో కేంద్ర ప్రభుత్వం అలార్ట్ అయ్యింది. ఇండియాలో కరోనా  కంట్రోల్ లో ఉన్నప్పటికీ మహ్మరిని అదుపు చేయాలంటే కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం చెబుతుంది. చైనాలో కరోనా విజృంబించి మరో రూపంలో ప్రపంచంపై దండెత్తుతుందని వస్తున్న వార్తలు గుండెలో దడ పుట్టిస్తోంది.

మరో రూపంలో కరోనా ఇండియాలోకి  రాక ముందే ఆరోగ్యశాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిద్దాం..

  • మారబోయిన మాన్విక్ రుద్ర

Leave A Reply

Your email address will not be published.

Breaking