నా హృదయాన్ని
ముక్కలుగా చేసిన ఫోటో ఇదే..?
అడవుల మధ్య స్వేచ్ఛగా జీవించే జంతువులకు కష్టాలు తప్పవెమో..?
ఏదోె కౄరమృగం దాడి చేసి చంపేయచ్చు.
కానీ.. ఈ ఫోటో నా హృదయాన్ని ముక్కలుగా చేసింది.
మితృడు సందీప్ వాట్సాప్ లో ఈ ఫోటో పంపుతూ జర్నలిస్ట్ గా మెస్సెజ్ రాయుమన్నాడు.
ఆ ఫోటో దుప్పి కళేబారాన్ని చూస్తుంటే
ఆ ఫీలీంగ్ ను అక్షరాలలో రాయలెనెమో..
ఆ రాళ్ల మధ్యకు ఎందుకు వెళ్లిందో.. అలా ఎలా ఇరుక్కుందో.,.
బండ రాళ్ల మధ్య నుంచి బయటకు రాలేక
ఎన్ని రోజులు నరకం అనుభవిస్తూ..
విల విలలాడుతూ ఎలా ప్రాణం పోయిందో ఆ ప్రాణిది….???
మనిషి జీవితం కూడా…
క్షణం.. క్షణం ప్రాణ భయమే. మానవత్వం లేని సమాజంలో మనిషి బతుకడం కష్టమే..
కరోనా ప్రపంచాన్ని కాటేసిన తరువాత బీమారైతే బతుకాలేమానే భయం మనలో ఉంది.
ఈ సృష్టిలో ‘చావు’ను తప్పించుకునే వారే లేరు.
అయినా.. నీది నాదీ అంటూ టెన్షన్ వైపు పరుగులు పెడుతున్నాం.
యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్