Header Top logo

రాష్ట్రంలో విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది – ఏఐఎస్ఎఫ్

AP 39TV 30 ఏప్రిల్ 2021:

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్రంలో పరీక్షలు పెట్టి తీరుతామన్న రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని వ్యతిరేకిస్తూ శుక్రవారం నాడు ఉరవకొండ పట్టణంలోని ఐదుకల్లు సదాశివన్ భవనం నందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందుతున్న ఇంతటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు పెట్టడాన్ని తప్పుబట్టారు.విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వారి బాస్ చెప్పారని విద్యార్థులకు పరీక్షలు పెట్టి తీరుతామని చెప్పడం సరైంది కాదన్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్  తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే దేశవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీను తలపించే విధంగా కరోనా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, ఒకవైపు ఆస్పత్రులలో బెడ్స్, వెంటిలేటర్లు,ఆక్సిజన్ కొరత ఉన్నప్పటికీ మరలా విద్యార్థులకు పరీక్షల పెట్టాలన్న మూర్ఖత్వం నిర్ణయంతో ఇప్పుడు వేల సంఖ్యలో ఉన్న కరోనా కేసులు లక్షలకు చేరే అవకాశాలు ఉంటాది అని వాపోయారు. విద్యార్థుల భవిష్యత్తును, ఆరోగ్యా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే విద్యార్థులను భయాందోళనకు గురి చేసేటటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంపై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు నమ్మకం లేకనే వారు కోర్టును ఆశ్రయించారని అన్నారు. విద్యార్థులు కోర్టును ఆశ్రయించినప్పుడే ఈ రాష్ట్రంలో విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది అన్న పరిస్థితులు బట్టబయలయ్యాయి అని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు పెడితే వారు చదువు పైన శ్రద్ధ పెట్టాలా, లేక వారి ఆరోగ్య శ్రేయస్సు పైన శ్రద్ధ పెట్టాలా దిక్కుతోచని స్థితిలోకి విద్యార్థులు పడిపోయారని అన్నారు.కోర్టు సైతం ఇంతటి విపత్కర పరిస్థితులలో పరీక్షలు పెట్టాల్సిన అవసరం ఏముందని సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం అన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండివైఖరికి చెంపపెట్టులాంటిదని అన్నారు. పక్క రాష్ట్రాల్లో సైతం పరీక్షల రద్దుచేసిటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు అవలంభించడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై తన మొండి వైఖరిని మార్చుకుని పది, ఇంటర్, డిగ్రీ తో పాటు వృత్తి విద్యా కోర్సుల పరీక్షలు అన్ని రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వంపై చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పెన్నోబులేసు, నియోజకవర్గ సహాయ కార్యదర్శి అన్వర్ భాష, నాయకులు,చిరు, ధనరాజ్, దీక్షిత్, ఆదర్శ్, నట్రాజ్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking