AP 39TV 05 మే 2021:
కనేకల్:రాయదుర్గం తాలూకా, కనేకల్ మండల కేంద్రంలో ను, గ్రామాలలోనూ మహమ్మారి కరోనా వలన ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకే ప్రజలకు అందుబాటులో ఉంటాయి అని కనేకల్ స్థానిక ఎస్ఐ దిలీప్ కుమార్ తెలియజేశారు. 12 గంటల తర్వాత మెడికల్ షాప్ లు, ల్యాబ్ టెక్నీషియన్ లాంటివి తప్ప మిగతావన్నీ షాప్ లో అందుబాటులో ఉండవని తెలియజేశారు. ఎవరైనా నియమ నిబంధనలు ఉల్లంఘించినట్లు అయితే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని,దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ పోలీసువారికి, ఆరోగ్య శాఖ ఉద్యోగులకు సహకరించాలని స్థానిక ఎస్సై దిలీప్ కుమార్ తెలియజేశారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని తెలియజేశారు.
R. ఓబులేసు,
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.